ఐటీశాఖ హెచ్చరిక: పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..లేకుంటే నష్టపోతారు

ఐటీశాఖ హెచ్చరిక: పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..లేకుంటే నష్టపోతారు

పాన్ను ఆధార్తో లింకింగ్ గడువుపై ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ కీలక సూచనలు చేసింది. గడువులోపు పాన్ను ఆధార్తో లింక్ చేయాలి.. లేకుంటే అధిక ట్యాక్స్ డిడక్షన్ (అధిక పన్నుకోత) తప్పదని హెచ్చరించింది. పాన్ ను ఆధార్తో లింకింగ్ కు గడువు మే 31న ముగియనున్నందు పన్ను చెల్లింపుదారులకు కొత్తగా నోటిఫి కేషన్ జారీ చేసింది. 

పాన్ , ఆధార్ లింక్ చేయపోతే ఏమౌతుంది? 

ఒకవేళ పాన్ , ఆధార్ గడువు లోపు లింక్ చేయకపోతే జూలై 31న చేయాల్సిన ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ (ITR)  ఫైలింగ్ పై ప్రభావం పడొచ్చు. ఏప్రిల్ 23న ఆధార్ , పాన్ లింకింగ్ పై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఓ సర్క్యూలర్ జారీ చేసింది. పూర్తి వివరాలను అందులో తెలిపింది. సర్క్యూలర్ ప్రకారం.. 
సాధారణ రేట్ల వద్ద TDS/TCSని తగ్గించబడిన డిడక్టర్, కలెక్టర్ సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. పాన్ లింకింగ్ చేయకపోతే డబుల్ టీడీఎస్ రేట్లు చెల్లించాల్సి వస్తుంది. 

ఎవరు పాన్, ఆధార్ లింకింగ్ చేయాలి ? 

ఇన్ కం ట్యాక్స్ యాక్టు సెక్షన్ 139AA ప్రకారం..జూలై 1, 2017 నాటికి పాన్ కార్డు కలిగి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఆధార్ కు లింక్ చేసుకోవచ్చు.మే 31, 2024లోపు ఈ లింకజీని పూర్తి చేయకపోతే.. పాన్ కార్డు పనిచేయదు. అయితే మినహాయింపు పొందిన వ్యక్తులపై దీని ప్రభావం ఉండదు. 

పాన్, ఆధార్ లింకింగ్ ఇలా చేయండి.. 

  • https://incometaxindiaefiling.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి.. రిజిస్టర్ చేసుకొని లాగిన్  అవ్వాలి. 
  • ప్రొఫైల్ సెట్టింగ్ లోకి వెళ్లి Aadhaar link ఆప్షన్ ను క్లిక్ చేయాలి. 
  • ఈ పాన్ కార్డులోని పుట్టిన తేదీ, జెండర్లను మీ ఆధార్ కార్డులోని వివరాలతో చెక్ చేసుకోవాలి. 
  • తర్వాత ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి లింకింగ్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. 
  • పాన్, ఆధార్ లింకింగ్ ప్రాసెస్ పూర్తి అయిందా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది అర్థరాత్రి లోపు నిర్ధారించుకోవాలి.