హనుమంతుడి జన్మస్థానంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

హనుమంతుడి జన్మస్థానంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
  • తితిదే కమిటీకి ప్రామాణికత లేదు 
  • వారి వాదనలు గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయి: గోవిందానంద

తిరుపతి: హనుమంతుడి జన్మస్థానంపై తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో జరిగిన చర్చ అసంపూర్తిగా ముగిసింది. తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మ స్థలమంటూ శ్రీరామనవమి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటనను హంపిలోని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఖండించింది. ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. దీనిపై ఇవాళ తితిదే పండిత కమిటీ సభ్యులు, హనుమద్‌ జన్మభూమి ట్రస్ట్‌ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి మధ్య తిరుపతిలో చర్చ జరిగింది. చర్చ అనంతరం గోవిందానంద మీడియాతో మాట్లాడారు. 

కల్పాలు, మన్వంతరాలు గడిచాక హనుమంతుడి జన్మస్థానంపై చర్చేంటని గోవిందానంద ప్రశ్నించారు. రామాయణం ప్రకారం కిష్కంధనే మారుతి జన్మ స్థలమని.. తితిదే కమిటీకి ప్రామాణికత లేదన్నారు. ధార్మిక విషయాలపై శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోటి పీఠాధిపతులు, మధ్వాచార్యులు, తిరుమల పెదజీయర్‌, చినజీయర్‌ సమక్షంలో చర్చించాలన్నారు. ఇది అధికారులు అభిప్రాయమే కానీ జీయర్ స్వాములకు సంబంధం లేదని చెప్పారు. సామాన్యులను గందరగోళంలోకి నెట్టేలా తితిదే వాదనలు ఉన్నాయని ఆక్షేపించారు. తితిదే నిర్ణయంపై తాము జీయర్‌ స్వాముల వద్దకు వెళ్తామని చెప్పారు. ముందుగా బహిరంగ చర్చకు టిటిడి అంగీకారం తెలిపి, చివరికు ఆంతరగీక చర్చగా మార్చేసారని  గోవిందానంద సరస్వతి పేర్కొన్నారు. 

టిటిడి చూపుతున్న ఆధారాలకు ప్రామాణికం లేదు...వారు చూపీన ఆధారాలనుమేము అంగీకరించడం లేదన్నారు. టిటిడి ఏర్పాటు చేసిన కమిటికి ఆథారిటి ఏమిటి..? స్వామిజీలు ఎవరూలేని కమిటి నివేదికకు ప్రామాణికత లేదన్నారు. రామానుజాచార్యులు సంప్రదాయం మేరకు హనుమంతుడి వివాహం అంగీకరిస్తారా...? రామాయణం ప్రకారం హనుమంతుడు హంపిలోనే జన్మించారు. శ్రుంగేరి శంకరాచార్యులు, చిన్నజియ్యంగార్లు, కంచి పీఠాధిపతి సమక్షంలో చర్చలు జరగాలి, టిటిడి అందించిన నివేదికను శ్రుంగేరి శంకరాచార్యులు, చిన్నజియ్యంగార్లు,మద్వాచార్యులు,కంచి పిఠాధిపతి ముందు వుంచుతాం...అందులో తప్పులపై ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు.