తెలంగాణలో ఓ లెక్క ప్రకారమే భూముల రేట్ల పెంపు

తెలంగాణలో ఓ లెక్క ప్రకారమే భూముల రేట్ల పెంపు
  •     జులై చివర్లో లేదా ఆగస్టు నుంచి అమలు
  •     నెల రోజుల పాటు ప్రజల అభ్యంతరాల స్వీకరణ
  •     కసరత్తు చేస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ వాల్యూ పెంపుతో ఏటా రూ.4 వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బహిరంగ మార్కెట్​లో అమ్మకాలు, కొనుగోళ్ల ధరల ప్రకారం భూముల మార్కెట్ వాల్యూ శాస్ర్తీయంగా ఉండేలా అధికారులు పెంపు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెంపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్​లో సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, ఏఐజీలు, జాయింట్ ఐజీలు, డీఐజీలు వివరాలు తీస్తున్నారు.

ఎక్కడ ఎంత పెంపు అవసరం ఉంది? ఏ మేరకు పెంచాలనే దానిపై లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ తర్వాత భూముల విలువ పెంపుపై ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నట్టు తెలిసింది. తర్వాత ఆ ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదులు తీసుకోనున్నారు. ఇందుకు కనీసం నెల సమయం తీసుకుంటారు. పూర్తి స్థాయిలో అంతా ఓకే అని నిర్ధారణకు వచ్చాక.. భూముల విలువ పెంపును అధికారికంగా ప్రకటించనున్నారు.

జులై నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి తేదీ నుంచి పెంచే భూముల విలువలు అమల్లోకి వస్తాయని సెక్రేటరియెట్​లో ఉండే ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. బహిరంగ మార్కెట్ రేటుకు.. ప్రభుత్వ మార్కెట్ వాల్యూకు ఎక్కడెక్కడ ఎక్కువ వ్యత్యాసం ఉన్నదనే దానిపై ముందు వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ ఎంత పెంచాలి? కొంచెం అటు ఇటుగా ఉన్నదగ్గర ఎంత పెంచాలనే దానిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తున్నది.

2021, 2022లో సవరణలు

రాష్ట్రంలో 2021 జులైలో భూముల విలువలను, స్టాంప్ డ్యూటీ సవరించారు. ఆ తర్వాత మళ్లీ 2022లో భూముల విలువల్లో మార్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.18,500 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వస్తాయని అంచనా వేసింది. గతేడాది ఇంతే మొత్తం అంచనా వేయగా రూ.14,300 కోట్లకే పరిమితమైంది. దీంతో ఈ గ్యాప్​ను పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచనున్నారు. వివిధ ప్రాంతాల్లో సాగు, సాగేతర భూములకు ప్రస్తుతం వాస్తవంగా ఉన్న విలువ, ఎంత మేరకు పెంచడానికి వీలున్నదనే విషయాలపై స్టడీ చేస్తున్నారు. అపార్టుమెంట్లు, నివాస గృహాలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న ధరలు, మార్కెట్​లో వాస్తవంగా ఉన్న విలువలను కూడా స్టడీ చేస్తున్నారు.

అయితే ఇష్టారీతిన కాకుండా ఒక పద్దతిలో పెంచాలని భావిస్తున్నారు. ఉదాహరణకు జుబ్లీహిల్స్, బంజరాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ వాల్యూ గజం లక్ష.. లక్షన్నర రూపాయాలు ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో గతంలోనే పెంచిన ప్రభుత్వ మార్కెట్ వాల్యూతో లక్షకు చేరువైంది. ఇప్పుడు దానిని ఇంకొంత పెంచుతారు. ఇలా సంపన్నులు, ఆ స్థాయిలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగే ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక మిడిల్ క్లాస్ ఏరియాలు, బస్తీల్లో అపార్ట్​మెంట్లకు బహిరంగ మార్కెట్ వాల్యూలో కనీసం 60 శాతం నుంచి 70 శాతం ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ఉండేలా సవరణ చేయనున్నట్లు తెలిసింది. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలు, పారిశ్రామిక ఏరియాలు, డెవలప్​మెంట్ జరిగే ప్రాంతాలు అంటూ విభజన చేసుకుని మార్కెట్ వాల్యూ సవరించేందుకు సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. పేపర్ వర్క్ పూర్తి కాగానే.. కమిటీల వారీగా ఫీల్డ్ విజిట్ చేసి మరోసారి నిర్ధారణ చేసుకోనున్నారు.

ఒక్కసారి పెంపుతో అమాంతం పెరిగిన ఆదాయం

ఉమ్మడి ఏపీలో 2013లో చివరి సారి ఫీజుల పెంపు జరిగింది. దాని ప్రకారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువపై రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు 6 శాతంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఫీజులను 2021లో సవరించారు. స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ 0.5, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛార్జీలు 1.5 శాతం కలిపి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువలో 7.5 శాతంగా ఉంది. వ్యవసాయ భూములకు ఎకరాకు కనీస ధర రూ.75 వేలు, ఖాళీ స్థలాలకు చదరపుగజం చొప్పున, నివాసాలకు చదరపుఅడుగు చొప్పున కనీస ధర నిర్ణయించి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ పెంచారు.

2020-–21లో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,260 కోట్ల రాబడి వచ్చింది. 2021 జులైలో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరల సవరణతో 2021-–22లో రూ.12,370 కోట్లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- మల్కాజ్ గిరి జిల్లాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. ప్రభుత్వ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు.

దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం రాబడి కోల్పోతున్నదన్న చర్చ వినిపిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ సవరించడం ద్వారా ఖజానాకు రూ.4 వేల కోట్లకు పైగా రాబడి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.