పెరిగిన కార్ల హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌

పెరిగిన కార్ల హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్యాసింజర్ బండ్ల డిస్పాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కిందటి నెలలో పెరిగాయి. పెద్ద కంపెనీల సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రోత్ కనిపించింది. చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల షార్టేజ్ తీరడంతో పాటు డిమాండ్ బాగుండడంతో కంపెనీలకు కలిసొస్తోంది. 

మారుతి సుజుకీ..

మారుతి సుజుకీ కిందటి నెలలో  1.78 లక్షల వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు డిస్పాచ్  చేసింది. కిందటేడాది మే నెలలో రికార్డ్ అయిన హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది మే లో 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 శాతం గ్రోత్ నమోదు చేసింది. హ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, కంపెనీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ సేల్స్ ఊపందుకున్నాయి. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13 శాతం పెరిగి 1.52 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.6 శాతం తగ్గి 26,477 యూనిట్లుగా నమోదయ్యాయి. మిని, కాంపాక్ట్ కార్ల హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 శాతం తగ్గి 83,655 యూనిట్లుగా రికార్డవ్వగా, యుటిలిటీ వెహికల్స్ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 65 శాతం పెరిగి 46,243 యూనిట్లకు చేరుకున్నాయి. 

హ్యుండయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

హ్యుండయ్ హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్ కిందటి నెలలో 59,601 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ మోడల్స్ క్రెటా, వెన్యూకి డిమాండ్ బాగుండడంతో కంపెనీ హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 16 శాతం వృద్ధి సాధించాయి. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ చేసిన డిస్పాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 15 % వృద్ధి సాధించి 48,601 యూనిట్లకు చేరుకోగా,  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22.6 శాతం ఎగిసి 11,000 యూనిట్లుగా నమోదయ్యాయి. 

టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమర్షియల్ వెహికల్ అమ్మకాలు ఈ ఏడాది మే నెలలో బాగా తగ్గాయి. దీంతో కంపెనీ మొత్తం హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటేడాది మే నెలతో పోలిస్తే 2% తగ్గి 73,448 యూనిట్లుగా రికార్డయ్యాయి.  ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీడియం కమర్షియల్ వాహనాల డిస్పాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కిందటి నెలలో 38 % పడిపోయాయని, కార్గో, పికప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్ 19 % తగ్గాయని టాటా మోటార్స్ పేర్కొంది. కానీ, కంపెనీ ప్యాసింజర్ వెహికల్స్ డిస్పాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాత్రం 6 శాతం ఎగిసి 45,894 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12% తగ్గి 28,989 యూనిట్లకు, హెవీ కమర్షియల్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  11 శాతం పెరిగి 8,160 యూనిట్లకు చేరుకున్నాయి. 

మహీంద్రా అండ్ మహీంద్రా..

మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ మే 2022 తో పోలిస్తే కిందటి నెలలో 22 శాతం ఎగిసి 32,886 యూనిట్లకు చేరుకున్నాయి. ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబంధిత పార్టుల సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులు ఏర్పడడంతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ, పిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్ అమ్మకాలు పడ్డాయని కంపెనీ  ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నక్రా పేర్కొన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాగ్ ఈసీయూ వంటి పార్టుల్లో వాడే సెమీకండక్టర్ల కొరత ఈ నెలలోనూ కొనసాగిందని అన్నారు. కంపెనీ త్రీ వీలర్ సేల్స్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్ ఇయర్ ప్రకారం 61 % పెరిగి 5,851 యూనిట్లకు చేరుకోగా, మీడియం, లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమర్షియల్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్ 7 శాతం తగ్గి 16,140 యూనిట్లకు పడ్డాయి. ట్రాక్టర్ డిస్పాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 4 శాతం తగ్గాయి.