సిమెంట్​ గిరాకీకి ఢోకా ఉండదు

సిమెంట్​ గిరాకీకి ఢోకా ఉండదు

చెన్నై: హౌసింగ్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నందున సిమెంట్​ గిరాకీకి ఢోకా ఉండదని ఇండియా సిమెంట్స్​ మేనేజింగ్​ డైరెక్టర్​ శ్రీనివాసన్​ వెల్లడించారు. మెట్రో సిటీలు, సెమి అర్బన్​, అర్బన్​ సెంటర్లలో నిర్మాణాలు జోరుగానే సాగుతున్నాయని పేర్కొన్నారు. కానీ, సిమెంట్​ ప్రొడక్షన్​ ఖర్చులే బాగా పెరుగుతున్నాయని చెప్పారు.

ఇండియా సిమెంట్స్ వర్చువల్​గా నిర్వహించిన​ ఏజీఎంలో శ్రీనివాసన్​ మాట్లాడారు. 2021–22 లో కన్​స్ట్రక్షన్​ సెక్టార్​ రివైవ్​ అయిందని, ఫలితంగా సిమెంట్​ డిమాండ్​ ఊపందుకుందని అన్నారు. థర్మల్​ కోల్​, పెట్​ కోక్​తోపాటు ఇతర ముడి సరుకుల రేట్లు భారీగా పెరగడంతో సిమెంట్​ ప్రొడక్షన్​ ఖర్చు ఎక్కువైందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధ ప్రభావం వల్ల కూడా కోల్​, ఆయిల్​ సరఫరాలపై పడిందన్నారు. ఇండియా సిమెంట్స్​ పెర్​ఫార్మెన్స్​ గురించి ప్రస్తావిస్తూ, వాల్యూమ్​ కొద్దిగా పెరిగి 90.70 లక్షల టన్నులకు చేరిందని, సొంత ఫ్యాక్టరీలలో కెపాసిటీ యుటిలైజేషన్​ 58 శాతానికి పెరిగిందని శ్రీనివాసన్​ వెల్లడించారు.