
సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు
ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి
గ్లోబంతా హెరాస్ మెంట్ తో వేడెక్కిపోయింది
యూఎస్ వుమెన్ లేటెస్ట్ స్టడీ
కరోనా లాక్‌డౌన్ టైంలో ఆడవాళ్ల మీద వేధింపులు పెరిగిపోయాయని ఇప్పటికే విన్నాం. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లోనూ ఆడవాళ్లపై వేధింపులు ఎక్కువయ్యాయని రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘యూఎన్ వుమెన్’ స్టడీ చెప్తోంది.
గ్లోబంతా హెరాస్‌మెంట్‌తో వేడెక్కిపోయింది. కలిసి ఉంటే.. కలదు సుఖమేనా? కలవు గొడవలు కూడా! మనస్పర్థలు, వింత ప్రవర్తనలు అన్నన్నీ కలిసి.. ఆడవాళ్లపై వేధింపులకు కారణమవుతున్నాయి. ఈ వేధింపులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి కూడా వరదలా వచ్చి పడ్డాయి. సోషల్ మీడియాలో ఉండాలంటే.. భయం వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరంలో అమ్మాయిలపై ఆన్‌లైన్ హెరాస్‌మెంట్ విపరీతంగా పెరిగిపోయిందని ఐక్యరాజ్య సమితి వుమెన్ విభాగం అంటోంది.
కరోనా వల్లనే..
కరోనా వైరస్ వల్ల అంతా ఇంట్లోనే ఉంటూ.. స్క్రీన్‌ల ముందు స్టక్ అయిపోయారు. ఎవరితోనైనా మాట్లాడాలంటే.. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా తప్ప బయటకు వచ్చి కలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో సగం కంటే ఎక్కువ మంది ఆడవాళ్లు ‘డిజిటల్ ఎబ్యూజ్’ ని ఎదుర్కొన్నారని వెబ్ ఫౌండేషన్ పోల్‌లో బయటపడింది. ఎదుటివాళ్ల పర్మిషన్ లేకుండా.. వాళ్ల ఫొటోలు, వీడియోస్, ప్రైవేట్ సమాచారం అంతా ఆన్‌లైన్‌లో ఇష్టం వచ్చినట్టు షేర్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు.
పాస్‌వర్డ్స్ షేర్ చేసుకుంటే
చాలామంది పార్ట్‌నర్స్ తమ మధ్యలో ఏ దాపరికం ఉండకూడదని పాస్‌వర్డ్స్ షేర్ చేసుకుంటారు. ఇది కూడా చాలా సందర్భాల్లో అబ్యూజ్‌కి దారి తీస్తుంది. ఇంకొంతమంది బయటివాళ్లు సోషల్ మీడియా ఎకౌంట్స్‌ని హ్యాక్ చేసి ఫొటోలు దొంగిలించి పోర్న్ సైట్స్‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ హ్యాకర్స్‌లో చాలావరకు ఎక్స్‌పార్ట్‌నర్సే ఉంటున్నారు. కెనడా, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, జర్మనీ దేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. టెక్నాలజీ అప్‌డేట్ అవుతోంది కానీ, దానికి తగ్గట్టుగా చట్టాలు మాత్రం అప్‌డేట్ కావట్లేదు. విచ్చలవిడిగా వేరేవాళ్ల ఫొటోలు వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో షేర్ చేసినా.. మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్‌లో పెట్టినా వెంటనే యాక్షన్ తీసుకునే చట్టాలు చాలా దేశాల్లో లేవు.
ఇలాంటి ఆన్‌లైన్ బ్లాక్‌మెయిల్స్‌ని అడ్డుకోవడానికి నవంబర్‌లో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ‘స్పెషల్ వుమెన్ పొలీస్ టీమ్’ని ఏర్పాటు చేసింది. అన్ని దేశాలు ఇలా చేస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం.
టెక్ టూల్స్
ఇలాంటి బాధలు ఫేస్ చేస్తున్నవాళ్లలో దాదాపు 64 శాతంమందికి అపరిచితుల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌తో పాటు జూమ్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ సైతం.. వెబ్ హెరాస్‌మెంట్‌కి వ్యతిరేకమని, అలాంటి కంటెంట్‌ని వెంటనే తొలగిస్తున్నామని చెప్తున్నాయి. సెపరేట్ మెకానిజంతో ఇలాంటి అబ్యూజ్డ్ ట్వీట్స్‌ని, అకౌంట్స్‌ని గుర్తిస్తున్నామని ట్విట్టర్ అంటోంది. ఫేస్‌బుక్ కూడా ఇలాంటి మెసేజ్‌లని, పోస్టులను గుర్తించి బ్లాక్ చేసే మెకానిజంని తీసుకొచ్చింది. అయితే, దీన్ని మరింత ఎఫెక్టివ్‌గా తయారు చేయాల్సి ఉంది.
డిజిటల్ కంట్రోల్
ఈ వేధింపులకు చాలామంది ఎక్స్‌పార్ట్‌నర్స్ కారణమవుతున్నారు. అలాగే, సింగిల్‌గా ఉంటున్న వాళ్లను పరిచయం లేనివాళ్లు ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారు. వాళ్ల సోషల్ మీడియా ఎకౌంట్స్‌ని హ్యాక్ చేసి.. ఫొటోలు, సమాచారం దొంగిలించి బెదిరిస్తున్నారు”అని చెప్తోంది ఆ స్టడీ. సాఫ్ట్‌వేర్ల సాయంతో హ్యాక్ చేయడం అమెరికాలో విపరీతంగా పెరిగిందట.
ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి
క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు
రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్