కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి .. టూరిజం ఎండీ క్రాంతికి ఏఐటీయూసీ వినతి

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి .. టూరిజం ఎండీ క్రాంతికి ఏఐటీయూసీ వినతి

హైదరాబాద్, వెలుగు: టూరిజం డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో  పనిచేస్తున్న కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ టూరిజం కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు వీఎస్​. బోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి కోరారు.  హిమాయత్​నగర్​లోని టూరిజంలో ఆఫీస్ లో మంగళవారం  టూరిజం ఎండీ  వల్లూరి క్రాంతిని కలిసి  వినతి పత్రం అందించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికులను పర్మినెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని డిమాండ్​ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పదవి విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలన్నారు. దీనిపై ఎండీ  సానుకూలంగా స్పందించారని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఏఐటీయూసీ పేర్కొంది.