ఇండియన్స్ను ఆకర్షించేందుకు.. రోడ్ షో నిర్వహించిన శ్రీలంక టూరిజం బ్యూరో

ఇండియన్స్ను ఆకర్షించేందుకు.. రోడ్ షో నిర్వహించిన శ్రీలంక టూరిజం బ్యూరో

హైదరాబాద్​, వెలుగు: తమ దేశానికి మరింత మంది భారతీయ టూరిస్టులను ఆకర్షించడం,   తనను తాను సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు  ప్రదర్శనల (మైస్​) గమ్యస్థానంగా నిలబెట్టుకోవడానికి శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో హైదరాబాద్​లో మంగళవారం (జులై 01) రోడ్​ను నిర్వహించింది. 

శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో (ఎస్ఎల్బీబీ) దీనిని ఏర్పాటు చేసింది. భారతీయ ‘మైస్’ ప్లానర్లు, కార్పొరేట్ ట్రావెల్ నిపుణులు, ట్రావెల్ ట్రేడ్ పార్టనర్లు, ఎస్​ఎల్సీబీ అధికారులు,  హోటళ్లు, టూర్ ఆపరేటర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.  

శ్రీలంక , భారతదేశం మధ్య బంధాలను బలోపేతం చేయడం,  పర్యాటక , మైస్  రంగాలలో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను పెంపొందించడం తమ లక్ష్యమని  చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషన్ లో యాక్టింగ్ డిప్యూటీ హైకమిషనర్ హర్ష రూపరత్నే చెప్పారు. ఈ ఏడాది జనవరి– మే  మధ్య 2,04,060 మంది భారతీయులు తమ దేశాన్ని సందర్శించారని చెప్పారు.