దశావతారాల పురాణ గాథ.. మహావతార్ నరసింహా

దశావతారాల పురాణ గాథ.. మహావతార్ నరసింహా

కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్‌‌‌‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’.  అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్  నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్‌‌‌‌ను జులై 25న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా ఐదు భాషల్లో త్రీడీ ఫార్మాట్‌‌‌‌లో విడుదల చేస్తున్నారు.

 మంగళవారం (జులై 01) రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అధర్మం పెరిగినప్పుడు అతను దేవుళ్లకు   సవాలు విసిరాడు’ అంటూ  ఈ చిత్రంలోని హిరణ్యకశ్యప పాత్రను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంది. 

యానిమేటెడ్ ఫ్రాంచైజీగా దీన్ని రూపొందించారు. మహావిష్ణువు దశావతారాల పురాణ గాథను ఇందులో చూపిచంబోతున్నారు. త్రీడీ విజువల్స్‌‌‌‌,  బెస్ట్ టెక్నికల్ వాల్యూస్‌‌‌‌తోపాటు పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ బీజీఎం ఇంప్రెస్ చేస్తున్నాయి.