టాప్​‑7 సిటీల్లో పెరిగిన ఇండ్ల సేల్స్

టాప్​‑7 సిటీల్లో పెరిగిన ఇండ్ల సేల్స్
  • 2021లో సేల్స్​ 71 శాతం అప్​
  • ప్రీ-కోవిడ్ లెవెల్​తో పోలిస్తే 10 శాతం డౌన్​
  • హైదరాబాద్​లో 25,410 యూనిట్ల అమ్మకం
  • 51,470 యూనిట్ల లాంచ్​

న్యూఢిల్లీ: ఇండియాలోని టాప్ ఏడు నగరాల్లో2020తో పోలిస్తే 2021లో ఇండ్ల అమ్మకాలు 71 శాతం పెరిగి 2,36,530 యూనిట్లకు చేరుకున్నాయి.   ఇండ్ల అమ్మకాలు 2020లో 1,38,350 యూనిట్లు కాగా, 2019 క్యాలెండర్ సంవత్సరంలో 2,61,358 యూనిట్లు. అయితే డిమాండ్ ఇప్పటికీ కోవిడ్‌‌‌‌కు ముందుస్థాయిల కంటే తక్కువే ఉంది.  ముంబైకి చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్టు ప్రకారం.. హోంలోన్లపై తక్కువ వడ్డీ రేట్లు, పెంటప్ డిమాండ్, సొంతింటిపై ఇష్టం పెరగడం  భారీ డిస్కౌంట్లు ఇండ్ల అమ్మకాల పెరుగుదలకు కారణం.  

పండగ డిమాండ్ కారణంగా గత సంవత్సరపు మొత్తం అమ్మకాలలో దాదాపు 39 శాతం సేల్స్​ నాలుగో క్వార్టర్​లోనే సాధ్యమయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎఆర్)లో హౌసింగ్ అమ్మకాలు 2021లో 72 శాతం పెరిగి 76,400 యూనిట్లకు చేరాయి. అంతకుముందు సంవత్సరంలో ఇది 44,320 యూనిట్లు. హైదరాబాద్‌‌లో అమ్మకాలు 2020లో 8,560 యూనిట్ల నుంచి దాదాపు మూడు రెట్లు పెరిగి 25,410 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీ–-ఎన్‌సీఆర్ అమ్మకాలు 2020లో 23,210 యూనిట్ల నుండి 2021లో 73 శాతం పెరిగి 40,050 యూనిట్లకు చేరుకున్నాయి. పుణేలో ఇండ్ల అమ్మకాలు 53 శాతం పెరిగాయి. ఇవి 2020లో 23,460 యూనిట్ల నుంచి 2021లో 35,980 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో గత ఏడాది 24,910 యూనిట్లు అమ్ముడవగా, 2021లో 33 శాతం పెరిగి 33,080 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో సేల్స్​ 2020లో 6,740 యూనిట్ల నుంచి 2021లో 86 శాతం పెరిగి 12,530 యూనిట్లుగా రికార్డయ్యాయి. కోల్‌‌కతాలో అమ్మకాలు 2020లో 7,150 యూనిట్లు ఉండగా, 2021 లో 13,080 యూనిట్లకు పెరిగాయి.  
భారీగా పెరిగిన లాంచ్​లు
 గత ఏడాది ఈ ఏడు నగరాల్లో కొత్త లాంచ్‌‌‌‌లు 85 శాతం పెరిగి 2,36,700 యూనిట్లకు చేరుకున్నాయి. ఇవి అంతకుముందు సంవత్సరంలో 1,28,000 యూనిట్లు మాత్రమే. 2019లో, కొత్తగా 2,36,570 యూనిట్లు లాంచ్​ అయ్యాయి. ముంబై మార్కెట్‌‌లో ఇవి 30,290 యూనిట్ల నుండి 2021లో 88 శాతం పెరిగి 56,880 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌‌లో కొత్త లాంచ్‌‌లు 21,110 యూనిట్ల నుండి 2021 నాటికి రెండు రెట్లు పెరిగి 51,470 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీ-–ఎన్‌సీఆర్ మార్కెట్‌‌లో 2020లో 18,530 యూనిట్ల నుండి 2021లో 31,710 యూనిట్లకు పెరిగాయి.  

పుణేలో ఇవి 67 శాతం పెరిగి 39,870 యూనిట్లకు చేరాయి.  బెంగళూరులో గత ఏడాది 21,420 యూనిట్లు లాంచ్​ కాగా, 2021లో  43 శాతం పెరిగి 30,650 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌‌కతాలో కొత్త లాంచ్‌‌లు మునుపటి సంవత్సరంలో 3,530 యూనిట్లు ఉండగా, 2021 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13,750 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో కొత్త లాంచ్‌‌లు 35 శాతం పెరిగి 2021లో 12,370 యూనిట్లకు చేరాయని అనరాక్​ తెలిపింది.