మెదక్ జిల్లాలో పెరిగిన హత్యలు, కిడ్నాప్​లు

మెదక్ జిల్లాలో పెరిగిన హత్యలు, కిడ్నాప్​లు

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో గతంతో పోలిస్తే హత్యలు, కిడ్నాప్​లు, అత్యాచారాలు పెరిగాయని, సాధారణ కేసులు గతంతో పోలిస్తే 11 శాతం పెరిగాయని జిల్లా ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో 2023 క్రైమ్ వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర చెక్​పోస్టుల ద్వారా రూ. 3,31,16,300 నగదు, 6966. 83 గ్రాముల బంగారం, 7,458 లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు. 

వీటితోపాటు 1258.407 లీటర్ల మద్యం,313.5 క్వింటాళ్ల పీడీఎఫ్​బియ్యం,634 కిలోల గంజాయి ,8 వేల లీటర్ల అక్రమ డీజిల్​, రూ. 70 లక్షల విలువైన ఆల్ఫాజోలం సీజ్ చేశామన్నారు. సైబర్ నేరాలలో  రూ. 3, 62, 31, 65 ను హోల్డ్ చేశామని, జనవరి నుంచి ఇప్పటివరకు 19,822 పాస్​పోర్ట్​ అప్లికేషన్లలో 19,427 అప్లికేషన్లను క్లియర్ చేశామని తెలిపారు. తీవ్రమైన కేసులు ఏడాది 7135 నమోదు కాగా, హత్యలు 14 6%. 60 శాతం,  అత్యాచారాలు 17 శాతం పెరిగాయన్నారు. 

జీవిత ఖైదు శిక్షలు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గత ఏడాది కంటే 13 శాతం తగ్గిందని, వాహనాల తనిఖీ సమయంలో 2,44,593 కేసుల్లో  రూ.9,59,53,273 జరిమానా విధించామన్నారు. డ్రంకెన్​ డ్రైవ్​లో 11,404 కేసులు నమోదు చేసి1,15,55,200 జరిమానా విధించామన్నారు.
2023 మెదక్ జిల్లా క్రైం రిపోర్ట్
 

మెదక్: గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో కేసుల నమోదు పెరుగగా, మహిళలపై భర్తల వేధింపుల కేసులు, మహిళల హత్యలు పెరిగాయి. 2023 ఏడాది క్రైం రిపోర్ట్ను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం విడుదల చేసింది. 2021లో అన్ని రకాల కేసులు కలిపి 3,980 నమోదు కాగా, 2022లో 4,081 కేసులు,  2023లో 4,187 కేసులు నమోదయ్యాయి. మహిళలపై జరిగిన నేరాలను పరిశీలిస్తే భార్యలపై భర్తల వేధింపులు (498 ఏ) 2021లో 123 కేసులు నమోదు కాగా, 2022లో 137 నమోదు కాగా  2023లో ఆ కేసుల సంఖ్య154 కు పెరిగాయి. 

అలాగే 2021లో ఏడుగురు, 2022లో 8 మంది మహిళలు హత్యకు గురికాగా, ఈ ఏడాది 12 మంది హత్యకు గురయ్యారు. వరకట్న మరణాలు గతేడాది 7 జరుగగా ఈ సారి 5 జరిగాయి. మహిళల కిడ్నాప్ కేసులు గతేడాది 40 నమోదు కాగా ఈ సారి 34 కేసులు నమోదయ్యాయి. రేప్లు గతేడాది 47 నమోదు కాగా, ఈసారి 34 కేసులు నమోదయ్యాయి. గతేడాది 23 మర్డర్లు జరుగగా ఈసారి వాటి సంఖ్య 26కు పెరిగింది. ఆస్థికోసం హత్యలు గతేడాది 4 జరుగగా ఈ సారి 7 జరిగాయి. కిడ్నాపింగ్లు గతేడాది 40 జరుగగా ఈసారి 37 కేసులు నమోదయ్యాయి.