వయసైనంక  పిల్లలే ఆధారం

వయసైనంక   పిల్లలే ఆధారం
  • రాష్ట్రంలో పెరిగిన ఓల్డేజ్​ డిపెండెన్సీ
  • పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ
  • ఎల్డర్లీ ఇండియా సర్వే 2021లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్వతంత్రంగా, ఒంటరిగా జీవించే వృద్ధుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలు, ఇతరులపై ఆధారపడి జీవనం సాగించే వారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది తమ వృద్ధాప్యంలో రోజువారి పనుల కోసం ఇతరులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ ఓల్డేజ్ డిపెండెన్సీ పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎక్కువగా ఉండటం, అందులోనూ మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఎల్డర్లీ ఇన్​ఇండియా 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌021’ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 60 ఏళ్లు దాటిన వారు 9.2 శాతం(32.29 లక్షలు) ఉండగా, 2021కి వచ్చేసరికి ఆ జనాభా11 శాతానికి(41.60 లక్షలు) చేరుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన మహిళలు 22.29 లక్షల మంది, పురుషులు 19.29 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇతరులపై ఆధారపడకుండా జీవించే వృద్ధులు 38 శాతం ఉండగా, పాక్షికంగా ఆధారపడేవారు 31 శాతం మంది, పూర్తి స్థాయిలో ఆధారపడేవారు మరో 31 శాతం మంది ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. అర్బన్​ఏరియాల్లో ఇతరులపై ఆధారపడకుండా జీవించే వృద్ధులు 28 శాతం మాత్రమే ఉండగా, పాక్షికంగా ఆధారపడేవారు11శాతం మంది ఉన్నారు. మిగతా 61 శాతం మంది పూర్తి స్థాయిలో ఇతరులపై ఆధారపడే జీవనం సాగించడం గమనార్హం. పూర్తిగా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారిలో మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. రూరల్ ఏరియాలో 48 శాతం మహిళలు, అర్బన్ ఏరియాలో 84 శాతం మంది మహిళలు పూర్తిగా ఇతరులపై ఆధారపడుతున్నారు. మగవాళ్లలో ఈ పర్సంటేజీ రూరల్ లో 14, అర్బన్​ ఏరియాల్లో 43 శాతం మాత్రమే ఉంది. వీళ్లలో 79 శాతం మంది ఆర్థికంగా తమ సొంత పిల్లలపై ఆధారపడుతుండగా, 11 శాతం మంది భార్య లేదా భర్త మీద, 5 శాతం మంది మనవళ్లు, మనవరాళ్ల మీద, మరో 5 శాతం మంది ఇతరుల మీద ఆధారపడుతున్నట్లు తేలింది.