బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

యాదాద్రి, వెలుగు : కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.ప్రమోద్ కుమార్ అన్నారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం తన పదవికి ఆయన రాజీనామా చేసి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్, నాయకులు కృష్ణమూర్తి, పిట్టల బాలరాజ్, సామల రవీందర్, ఠాకూర్ ప్రకాశ్, జితేందర్ గౌడ్, రాచమల్ల రమేశ్ పాల్గొన్నారు. 

కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలు మరువలేనివి 

సూర్యాపేట, వెలుగు : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీఆర్పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ13వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం యోగా సాధనలో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు పొందిన గూడూరు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చలమల్ల నరసింహ, చేనేత సహకార సంగం అధ్యక్షుడు కడారి భిక్షం, పోపా జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు సుదర్శన్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.