ఉద్యమంలో కొండా లక్ష్మణ్ పాత్ర మరువలేనిది

 ఉద్యమంలో కొండా లక్ష్మణ్ పాత్ర మరువలేనిది

హనుమకొండ, వెలుగు : భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఓబీసీ) చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ13వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం జీవితాంతం పోరాడారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగం, ధైర్యం, క్రమశిక్షణ ప్రతిఒక్కరికీ ఆదర్శమని చెప్పారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్,  ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీ గంగాపురం వేణుమాధవ్ గౌడ్, నాయకులు వివేకానంద, వైద్యం రాజగోపాల్, వొడితెల రాము, బొనగాని యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.