
- ఓసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి
ములుగు, వెలుగు : ఈడబ్ల్యూఎస్కమిషన్ ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఓసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి గోపు జైపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ములుగులోని రామాలయ ప్రాంగణంలో జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ పిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓసీలు ఉద్యమాల ద్వారా తమ హక్కులు కాపాడుకోవాలని సూచించారు. అక్టోబర్ లో వరంగల్ పట్టణంలో జరిగే అగ్రకుల పేదల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఓసీలందరూ ఐక్యంగా ఉండాలని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో ఓసీ కుల సంఘాల నాయకులు సంఘం నాయకులు కొమురవెల్లి రమేశ్, కామిడి సతీశ్ రెడ్డి, చింతలపూడి భాస్కర్ రెడ్డి, వేల్పూరి సత్యనారాయణరావు, మాదారపు వెంగళ్ రావు, గంగిశెట్టి శ్రీనివాస్, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, శిరుప సతీశ్, కొమురవెల్లి సతీశ్, వెంకట్ రెడ్డి, గంగిశెట్టి రాజ్ కుమార్, శ్రీనివాస్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.