పెండింగ్ డీఏలను మంజూరు చేయాలి : మట్టపల్లి రాధాకృష్ణ

పెండింగ్ డీఏలను మంజూరు చేయాలి : మట్టపల్లి రాధాకృష్ణ

సూర్యాపేట, వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్​ డీఏలను మంజూరు చేయాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్  టీచర్స్  యూనియన్  రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ కోరారు. ఆదివారం సంఘం కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ ను రద్దు చేయాలని, పాత పెన్షన్  విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. నగదు రహిత హెల్త్ కార్డులను అమలు చేయాలన్నారు.

 అంతకుముందు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గుణగంటి కృష్ణ(మోతే), కాసర్ల వెంకన్న(మద్దిరాల), అనురాధ(మోతే), వి.శ్రీనివాస్ రెడ్డి(పెన్​పహాడ్), ధర్మయ్య(ఆత్మకూర్–ఎస్) ను సన్మానించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మల శ్రీనివాస్, శ్రీనివాస్ నాయుడు, కె.నాగయ్య, శ్రీనివాస్ గౌడ్, ఏ.రమేశ్, శంకర్​రావు పాల్గొన్నారు.