పెరిగిన కీలక సెక్టార్ల ప్రొడక్షన్‌ ‌‌‌‌‌‌‌

పెరిగిన కీలక సెక్టార్ల ప్రొడక్షన్‌ ‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ల ప్రొడక్షన్ ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12.1 శాతం  పెరిగింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 0.7 శాతం ఎక్కువ వృద్ధి చెందింది. కోల్‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌, సిమెంట్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిసిటీ  ప్రొడక్షన్ పెరిగిందని  ప్రభుత్వ డేటా వెల్లడించింది. కోల్‌‌‌‌‌‌‌‌, క్రూడ్ ఆయిల్‌‌‌‌‌‌‌‌, నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, సిమెంట్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌, ఫెర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌  సెక్టార్లను కీలకమైన ఎనిమిది ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్లుగా పిలుస్తారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సెక్టార్లలో ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ 9.2 శాతం వృద్ధి చెందింది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– అక్టోబర్ మధ్య ఈ కీలక సెక్టార్ల ఔట్‌‌‌‌‌‌‌‌పుట్ 8.6 శాతం పెరిగిందని, కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.4 శాతంగా ఉందని ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడాది ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి  18.4 శాతం, స్టీల్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ 11 శాతం పెరిగింది.