
మాకు పిల్లలొద్దు
- దేశంలో ప్రతి వెయ్యి మంది మగాళ్లలో 249 మందిది ఇదే ఒపీనియన్
- ఆడవారిలో 56 మంది సంతానికి నో..
- మన రాష్ట్రం లో కాస్త తక్కువ
- 25–34 ఏళ్లున్న ఆడవారిలో 2%..
- మగవారిలో మాత్రం 34%
మొన్న మనమిద్దరం.. మనకిద్దరు..
నిన్న ఒక్కరు చాలు..
ఇప్పుడు అసలే వద్దు!
దేశంలో సంతానం వద్దనుకునేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇలాంటివారు రాష్ర్టంలో వేలల్లో , దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. 15 నుం చి 49 ఏళ్లున్న వివాహిత మహిళలు, పురుషులపై కేంద్ర ప్రభుత్వం చేయించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 56 మంది ఆడవాళ్లు, 249
మగవాళ్లు తమకు పిల్లలు వద్దనుకుంటు న్నారని ఈ సర్వేలో తేలింది.
సంతానంగా ఒక్కరు చాలని 29.4 శాతం మంది మహిళలు, 31.6 శాతం మంది మగాళ్లు భావిస్తున్నారు. మన రాష్ర్టంలో 4.8 శాతం మంది పిల్లలు వద్దనుకుంటుండగా, ఒక్కరి తో సరిపెట్టు కోవాలని 24.2 శాతం మంది ఆడవాళ్లు, 30.1 శాతం మగాళ్లు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టే అవకాశంలేని వారిని, కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్నవారిని, గర్భ నిరోధకాలు వాడుతున్నవారిని కూడా ఈ సర్వేపిల్లలు వద్దనుకునేవారి జాబితాలో చేర్చింది.
మన రాష్ర్టం లో తక్కువే..
తెలంగాణలో 15–24 ఏళ్లున్న పెళ్లయిన మహిళల్లో 0.7శాతం, 25–34 ఏళ్లున్న వారిలో 2 శాతం, 35–49 ఏళ్లున్నవారిలో 23.9 శాతం మంది తమకు పిల్లలు వద్దనుకుంటున్నారని సర్వే పేర్కొంది. మగవాళ్లలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది . 25–34 ఏళ్లున్న మగవారిలో 34 శాతం, 35–49 ఏళ్ల వయసున్నవారిలో 60.9 శాతం పిల్లలు వద్దనుకుంటు న్నారు. అరుణాచల్‌ప్రదేశ్ లో అత్యధికంగా 12.6 శాతం మంది మహిళలు పిల్లలు వద్దనుకుంటున్నారు.