పెరుగుతున్న శిల్ప బాధితుల సంఖ్య

V6 Velugu Posted on Dec 03, 2021

కిట్టీ పార్టీల పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేసి మోసంచేసిన శిల్పా చౌదరీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో పలువురు బిజినెస్ మెన్ లు, టాలీవుడ్ ప్రముఖులు మోసపోయారు. శిల్ప బాధితులలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఆమె వల్ల మోసపోయిన లిస్టులో టాలీవుడ్ యంగ్ హీరో హర్ష కానుమిల్లి చేరారు. సహేరీ సినిమాలో హీరోగా నటించిన హర్ష.. శిల్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పేరుతో శిల్ప.. హర్ష నుంచి రూ. 3 కోట్లు అప్పుగా తీసుకుంది.  ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో హర్ష పోలీసులను ఆశ్రయించాడు. 

ఇప్పటికే పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టయిన శిల్పను రెండు రోజుల పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దాంతో శిల్పకు శిల్ప కు వైద్య పరీక్షలు నిర్వహించి.. చంచల్ గూడ జైలు నుంచి నార్సింగ్ ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ రోజు సాయంత్రం వరకు శిల్పను ఎస్ఓటీ కార్యాలయంలోనే నార్సింగ్ పోలీసులు విచారించనున్నారు.
 

Tagged Movies, fraud, tollywood, Harsh Kanumilli, Shilpa Choudhary, kitty parties, saheri

Latest Videos

Subscribe Now

More News