ఆసీస్‌‌‌‌తో తొలి వన్డేలో.. టీమిండియా నం.1

ఆసీస్‌‌‌‌తో తొలి వన్డేలో.. టీమిండియా నం.1
  • ఆసీస్‌‌‌‌తో తొలి వన్డేలో ఇండియా గెలుపు
  • అన్ని ఫార్మాట్లలో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు టీమిండియా
  • రాణించిన రుతురాజ్‌‌‌‌, గిల్‌‌‌‌, షమీ

మొహాలీ : ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో బోణీ చేసిన టీమిండియా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (74), రుతురాజ్‌‌‌‌ (71) రాణించడంతో.. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. తాజా విజయంతో వన్డేల్లో టాప్​ ప్లేస్​కు వచ్చిన ఇండియా అన్ని ఫార్మాట్లలో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.

డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (52), జోష్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌ (45), స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (41) రాణించారు.  తర్వాత ఇండియా 48.4 ఓవర్లలో 281/5 స్కోరు చేసింది. గిల్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌కు 142 రన్స్‌‌‌‌ జోడించి బలమైన పునాది వేశారు. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (3), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (18) ఫెయిలైనా, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (58 నాటౌట్‌‌‌‌), సూర్యకుమార్‌‌‌‌ (50) హాఫ్‌‌‌‌ సెంచరీలతో మెరిశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌‌‌కు 80 రన్స్‌‌‌‌ జత చేసి గెలిపించారు. షమీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఆదివారం రెండో వన్డే ఇండోర్​లో జరుగుతుంది. 

షమీ పాంచ్‌‌‌‌ పటాకా

బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌‌‌‌పై షమీ (5/51) తన బౌలింగ్‌‌‌‌ నైపుణ్యాన్ని చూపెట్టాడు. ఇన్నింగ్స్‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌కే మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (4)ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. రెండో ఎండ్‌‌‌‌లో బుమ్రా (1/43), శార్దూల్‌‌‌‌ (0/78) ఫెయిల్‌‌‌‌ అయినా తాను మాత్రం వికెట్ల పతనాన్ని కంటిన్యూ చేశాడు. వార్నర్‌‌‌‌, స్మిత్‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌కు 94 రన్స్‌‌‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌‌‌ను స్థిరం చేయగా, లబుషేన్‌‌‌‌ (39), గ్రీన్‌‌‌‌ (31) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్లు అశ్విన్‌‌‌‌ (1/47), జడేజా (1/51) స్పిన్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం 59 రన్స్‌‌‌‌ జోడించింది.

అయితే 40వ  ఓవర్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌ అనూహ్యంగా రనౌట్‌‌‌‌ కావడంతో ఆసీస్‌‌‌‌ 186/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లిస్‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. గ్రీన్‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌ జోడించిన అతను స్టోయినిస్‌‌‌‌తో ఆరో వికెట్‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌ జత చేశాడు. చివర్లో షార్ట్‌‌‌‌ (2), సీన్‌‌‌‌ అబాట్‌‌‌‌ (2), జంపా (2) విఫలమైనా, కెప్టెన్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (21 నాటౌట్‌‌‌‌) కాసేపు బ్యాట్‌‌‌‌ అడ్డేయడంతో ఆసీస్‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది.