IND vs AUS : టీమిండియా ఆలౌట్

IND vs AUS : టీమిండియా ఆలౌట్

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోయారు. టీమిండియాను 109 పరుగులకు ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం దక్కలేదు. టాప్ బ్యాట్స్ మెన్స్ వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగులు దాటలేదు. కనీసం రెండు సెషన్లు కూడా ఆడకుండా ఆలౌట్ అయ్యారు. కునెమన్ కు ఐదు వికెట్లు తీసుకున్నాడు. లియాన్ కు మూడు, మార్ఫీకి ఒక వికెట్ దక్కాయి. 

విరాట్ కోహ్లీ (22 పరుగులు) టాప్ స్కోరర్. ఓపెనర్లు రోహిత్ శర్మ (12), శుభ్ మన్ గిల్ (21) పరుగులకే వెనుదిరిగాడు. పుజారా (1), శ్రేయస్‌ అయ్యర్ (0) నిరాశ పరిచారు. చివర్లో కాస్త నిలకడగా ఆడిన అక్షర్ పటేల్ (12) నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 14/1 తో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.