బంగ్లాపై 227 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ

బంగ్లాపై 227 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ

మూడో వన్డేలో  బంగ్లాదేశ్ పై భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 410 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా ఏ మాత్రం పోటీనివ్వలేదు. షకీబ్ హాసన్ 43, లిట్టన్ దాస్ 29, యాసిర్ అలీ 25, మహ్మదుల్లా 20, మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో బంగ్లాదేశ్ 34 ఓవర్లలో  182 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో శార్దూల్ 3, ఉమ్రాన్ 2, అక్షర్ పటేల్ 2, సిరాజ్ కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్  సుందర్ లు తలో వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ 2,- 1 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్ కు దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్..  బంగ్లా బౌలర్లను  ఊచకోత కోసింది. బంగ్లాదేశ్ కు 410 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. ఇషాన్ కిషన్ 210, విరాట్ కోహ్లీ 113 పరుగులతో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 210(24 ఫోర్లు,10 సిక్సులు), విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన వాషింగ్టన్  సుందర్ 37, అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది.బంగ్లా బౌలర్లలో  తాసిక్ అహ్మద్ 2, హోసెన్ 2, షకీబ్ అల్ హాసన్ 2, హసన్ మిరాజ్, ముస్తఫిజర్ రహ్మన్ లకు చెరో వికెట్ పడ్డాయి.