రాంచీలో టీమిండియా గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

రాంచీలో టీమిండియా గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

న్యూజిలాండ్ పై వన్డే సరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్  జనవరి 27 న  రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు ఈ  స్టేడియంలో మొత్తం  మూడు టీ20 మ్యాచ్ లు జరగగా మూడింటిలోనూ విజయం టీమిండియానే వరించడం విశేషం.  ఈ స్టేడియంలో  ముందుగా  బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్ ఒకసారి గెలవగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు గెలిచింది. ముందుగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.  

ఈ స్టేడియంలో  అత్యధిక స్కోర్ ( శ్రీలంకపై భారత్ ) 196 పరుగులు కాగా అత్యల్ప స్కోర్ 118 (భారత్ పై ఆస్ట్రేలియా) పరుగులు చేసింది. మరోవైపు ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22  టీ20 మ్యాచ్‌లు జరగ్గా 12 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగగా న్యూజిలాండ్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

భారత జట్టు: ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (c), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జితేష్ శర్మ, ముఖేష్ కుమార్, పృథ్వీషా


న్యూజిలాండ్  జట్టు:  డెవాన్ కాన్వే (wk), మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, జాకబ్ డఫీ, మైఖేల్ షివర్పన్, డానీ సివెర్పాన్, బెన్ లిస్టర్