India vs Pakistan: క్రికెట్ ఒక ఆట.. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు

India vs Pakistan: క్రికెట్ ఒక ఆట.. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు

క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు ఎంతో  క్రేజ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  వచ్చే నెలలో జరిగే ఆసియాకప్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌–నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లూ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లపై ఇప్పటి నుంచే  ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండో–పాక్‌‌‌‌‌‌‌‌ పోటీ గురించి టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

ఏ టోర్నీలో అయినా పాక్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అనగానే భారీగా అంచనాలు ఉంటాయన్న జడేజా.. ఆ గేమ్‌‌‌‌‌‌‌‌లో బాగా ఆడాలని ప్లేయర్లు తపిస్తారని చెప్పుకొచ్చాడు. 'ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఉందంటే మన జట్టు  గెలవాలని చాలా అంచనాలు ఉంటాయి.  కానీ మా వరకు జట్టు  ఆడే ఏ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అయినా ఇండో–పాక్‌‌‌‌‌‌‌‌  మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సమానమైన ప్రాముఖ్యతే  ఉంటుంది. అయితే, ఇండియా–-పాకిస్తాన్ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందనేది నిజం. కాబట్టి మేం కూడా మా బెస్ట్‌‌‌‌‌‌‌‌  పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి తపిస్తుంటాం..' అని స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌ ప్రోమోలో జడేజా చెప్పుకొచ్చాడు. 

ఇక గతేడాది ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓటమి గురించి కూడా జడేజా స్పందించాడు. ప్రతీ టోర్నీలో  ఇండియా ప్లేయర్లు తమ 100 శాతం పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని చూస్తారని  చెప్పాడు. ఒక్కోసారి రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా రాకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నాడు. 'మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచేందుకు మేం శాయశక్తులా కృషి చేస్తాం. కానీ, కొన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగదు. ఇది ఒక ఆట. రెండు జట్ల ఆటగాళ్లు వారి దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఇరువురూ గెలవాలనే ఆడతారు. ఆటపైనే మొత్తం ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టి, గ్రౌండ్​లో ఎంత బాగా ఆడినా.. ఫలానా ఫలితం వస్తుందని హామీ ఇవ్వలేం. ఇక్కడ ఫలితం కంటే విజయం కోసం కృషి చేయడమే ముఖ్యం..' అని జడ్డూ చెప్పుకొచ్చాడు.