Ind vs Pak: ముగ్గురు పేసర్లు..ఇద్దరు స్పిన్నర్లు...టీమిండియా తుది జట్టు ఇదే

Ind vs Pak: ముగ్గురు పేసర్లు..ఇద్దరు స్పిన్నర్లు...టీమిండియా తుది జట్టు ఇదే

భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే కిక్కు. దాయాదుల మధ్య పోరు మస్తు మజాగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినా..భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆసియాకప్ 2023లో భాగంగా రెండు జట్లు శ్రీలంకలో ఢీకొట్టుకోబోతున్నాయి. ఈ క్రమంలో  తుది జట్టులో ఏ ఆటగాడు చాన్స్ దక్కించుకుంటాడో చూద్దాం. 

కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడేది కన్ఫర్మ్.  అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో  రోహిత్ శర్మ ఇబ్బంది పడతాడని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ విమర్శలకు చెక్ పెట్టాల్సిందే. దీనికి తోడు హై ఓల్టేజ్ మ్యా్చ్ లో కెప్టెన్ గా నూ నిరూపించుకోవాల్సిన బాధ్యత రోహిత్ పై ఉంది. 

Also Read : పాక్ మస్తు ఆడుతోంది..గెలవడం కష్టమే..కానీ

శుభ్ మన్ గిల్...ఈ మధ్య కాలంలో గిల్ నిలకడగా రాణించకలేకపోతున్నాడు. ఐపీఎల్ 2023లో  అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత . న్యూజిలాండ్ పై  పరుగుల వరద పారించాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే, టెస్టుల్లో గిల్ పెద్దగా రాణించలేదు. దీంతో ఈ మ్యాచులోనైనా గిల్ మనుపటి ఫామ్ ను అందిపుచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కోహ్లీ దుమ్మురేపుతాడు. ఇటీవల కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్. ఇదే ఫామ్ ను పాకిస్తాన్ మ్యాచ్లో కొనసాగిస్తే..ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. 

శ్రేయాస్ అయ్యర్..గాయం కారణంగా కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమైన శ్రేయాస్..వందశాతం ఫిట్ నెస్ సాధించి పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఎలా రాణిస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే గాయం తర్వాత అయ్యర్..ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 

ఇషాన్ కిషన్...కేఎల్ రాహుల్ లేకపోవడంతో..వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు తుది జట్టులో స్థానం దక్కొచ్చు. దీనికి తోడు అతను సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో మూడు అర్థసెంచరీలు సాధించాడు. దీంతో ఇషాన్ పై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. 

హార్థిక్ పాండ్యా..టీమిండియాలో పాండ్యా కీలక ఆటగాడని చెప్పొచ్చు. బౌలింగ్, బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నోడు. గతంలో పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ను అభిమానులు కోరుకుంటున్నారు. 

జట్టులో జడేజా ఉన్నాడంటే ఓ భరోసా. బ్యాటింగ్ లో..బౌలింగ్ లో ఏదైనా మిరకిల్ చేస్తాడని నమ్మకం. విలువైన పరుగులు, అవసరమైనప్పుడు వికెట్లు తీయగల సత్తా జడేజా సొంతం. 

కుల్దీప్ యాదవ్..అద్బుతమైన స్పిన్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలకమైన సమయంలో భారత్ కు వికెట్లను అందిస్తున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్లోనూ కుల్దీప్ రాణిస్తే మాత్రం భారత్ దే విజయం. 

బుమ్రా..వెన్ను గాయంతో దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన బుమ్రా ..తిరిగి జట్టులోకి రావడం శుభపరిణామం. ఇటీవలే ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో బుమ్రా మళ్లీ టచ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో దాయాది జట్టుపై ఈ పేస్ గుర్రం చెలరేగితే మాత్రం అదుర్సే. 

మహ్మద్ సిరాజ్... భారత జట్టులో కొద్దికాలంగా మహ్మద్ సిరాజ్ రెగ్యులర్ పేసర్గా మారాడు. నిలకడైన ప్రదర్శనిస్తూ జట్టులో ప్రధాన పేసర్గా ఎదిగాడు.  అయితే కొన్ని సమయాల్లో సిరాజ్..ధారాళంగా పరుగులు ఇవ్వడం జట్టును కలవరపాటుకు గురిచేస్తుంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో సిరాజ్..పొదుపు బౌలింగ్ తో పాటు..వికెట్లు తీయాలని హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు. 

మహ్మద్ షమీ.. టీమిండియాకు వికెట్లను అందించే బౌలర్లలో షమీ నమ్మకమైన బౌలర్. ఇటీవల వెస్టిండీస్, ఐర్లాండ్ సిరీస్ లలో షమీ ఆడలేదు. చివరకు అతను జూన్ లో టీమిండియా తరపున మ్యాచ్ ఆడాడు. అయినప్పటికీ..పాకిస్తాన్ పై షమీ ప్రభావం చూపగలడు. హై వోల్టేజ్ మ్యాచ్ లో షమీ బౌలింగ్ లో కీలక పాత్ర పోషిస్తాడు. 

టీమిండియా తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. 

పాకిస్తాన్ తుది జట్టు : ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది.