IND vs SA 2nd Test: నిలకడగా ఆడుతున్న భారత్.. 74 పరుగుల ఆధిక్యం

IND vs SA 2nd Test: నిలకడగా ఆడుతున్న భారత్.. 74 పరుగుల ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కట్టడి చేసిన భారత ఆటగాళ్లు.. బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తున్నారు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. యశస్వి జైస్వాల్ (0) త్వరగా ఔటైనా.. శుభ్‌మన్‌ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), రోహిత్ శర్మ (39; 50 బంతుల్లో 7 ఫోర్లు) జోడి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 55 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 

ధాటిగా ఆడుతున్న వీరిద్దరిని నండ్రీ బర్గర్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(0) డకౌట్‌గా వెనుదిరిగడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ(38 నాటౌట్), కేఎల్ రాహుల్(0 నాటౌట్) జోడి  భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 27 ఓవర్లు ముగిసేసరికి.. 129/4. 74 పరుగుల ఆధిక్యంలో ఉంది.