IND vs SA: సఫారీ బౌలర్లపై దండయాత్ర.. సెంచరీ బాదిన సూరీడు

IND vs SA: సఫారీ బౌలర్లపై దండయాత్ర.. సెంచరీ బాదిన సూరీడు

మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. త‌న ట్రెడ్‌మార్క్ షాట్ల‌తో సఫారీ బౌల‌ర్ల‌పై విరుచుకుపడ్డాడు. జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌ వేదికగా ద‌క్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడ‌ర్‌ పోరులో సూర్య(100;  56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న సూర్య.. వంద చేరుకోవడానికి మరో 23 బంతులు మాత్రమే తీసుకోవడం గమనార్హం. టీ20ల్లో అతనికిది నాలుగో సెంచ‌రీ.

సూర్యకు తోడు య‌శ‌స్వీ జైస్వాల్(60; 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. తన 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న  నాండ్రే బర్గర్ తన 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. లిజాద్ విలియమ్స్ 46  పరుగులు సమర్పించుకున్నాడు.