భారత్-దక్షిణాఫ్రికా సిరీస్: లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్: లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత స్వదేశంలో జరిగిన టీ20ల్లో కంగారుల జట్టును చిత్తు చేసింది టీమిండియా. 4-1 తో టీ20 సిరీస్ గెలవగా... ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టూర్ లో అడుగుపెట్టి సవాలుకు సిద్ధమైంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జనవరి 7 రెండు టెస్టుల సిరీస్ తో ముగుస్తుంది. ఈ సిరీస్ కు సంబంధించి ఇప్పటికే ఇరు జట్లను, షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించగా సఫారీల టూర్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలో ఇప్పుడు చూద్దాం.

భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌ను ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ ప్రసారం అవుతుంది. మొబైల్స్ లో ఈ మ్యాచ్ ను    డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చు. ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ఇండియా డిసెంబర్ 6 న దక్షిణాఫ్రికాలోని డర్బన్ కు చేరుకోగా.. పరిమిత ఓవర్ల నుండి రెస్ట్ తీసుకున్న కోహ్లీ, రోహిత్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటారు. ఈ పర్యటనలో మొదట టీ20లు, ఆతర్వాత వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్ లు జరుగుతాయి. 

టీ20 భారత కాలమాన ప్రకారం రాత్రి 9:30 నిమిషాలకు జరుగుతాయి. ఇక తొలి వన్డే మధ్యాహ్నం 1:30కు, మిగిలిన రెండు వన్డేలు సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి. ఇక టెస్టుల విషయానికి వస్తే బాక్సింగ్ డే టెస్టు మధ్యాహ్నం 1:30 గంటలకు, రెండో టెస్టు మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానున్నాయి.  

ఇండియా vs సౌతాఫ్రికా టీ20 సిరీస్

డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) 
డిసెంబర్ 12: రెండో టీ20(గెబర్హా) 
డిసెంబర్ 14: మూడో టీ20 (జోహన్‌బర్గ్‌) 

ఇండియా vs సౌతాఫ్రికా వన్డే సిరీస్

డిసెంబర్ 17: మొదటి వన్డే (జోహన్‌బర్గ్‌) 
డిసెంబర్ 19: రెండో వన్డే (గెబర్హా) 
డిసెంబర్ 21: మూడో వన్డే (పర్ల్‌)

ఇండియా vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్

డిసెంబర్ 26 - 30: తొలి టెస్టు (సెంచూరియన్‌)  
జనవరి 3 - 7: రెండో టెస్టు (కేప్‌టౌన్‌)