టైమ్ వచ్చినప్పుడు మీకు చెక్‌ పెడతా.. సెలెక్టర్లకు అక్సర్ పటేల్ మాస్ వార్నింగ్

టైమ్ వచ్చినప్పుడు మీకు చెక్‌ పెడతా.. సెలెక్టర్లకు అక్సర్ పటేల్ మాస్ వార్నింగ్

జట్టుకు ఎంపిక చేయకపోవడం సెలెక్టర్లకు ఎంత కామనో.. వారిని హెచ్చరిస్తూ కౌంటర్లు ఇవ్వడం ఆటగాళ్లకు అంతే పరిపాటి. భారత క్రికెట్‌లో అలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, పృధ్వి షా అలాంటి మాస్ వార్నింగ్‌లు ఇచ్చారు. అంతా సాయి బాబానే చూసుకుంటారని షా ట్వీట్ చేస్తే, సెలెక్టర్లను సవాల్ చేసేలా తొడగొట్టిన ఫోటోను సర్ఫరాజ్ పోస్ట్ చేశారు. తాజాగా, ఈ జాబితాలోకి భారత ఆల్‌రౌండర్ అక్సర్ పటేల్ చేరారు. 

గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్‌కు దూరమైన అక్సర్ పటేల్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో పర్వాలేదనిపిస్తున్నాడు.  రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో బౌలింగ్‌లో అదరగొట్టి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. అక్సర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ అతనికి దక్షిణాఫ్రికాతో తలపడబోయే టీ20 జట్టులో చోటు దక్కలేదు. వన్డే జట్టులో అతనికి చోటు కల్పించిన సెలెక్టర్లు.. టీ20 సిరీస్ నుంచి తప్పించారు. దీంతో ఈ ఆల్‌రౌండర్ సెలెక్టర్లను ఉద్దేశిస్తూ క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు. 

మౌనమే అన్నింటికీ సమాధానమని చెప్పిన అక్సర్ పటేల్, సమయం వచ్చినప్పుడు సెలెక్టర్లకు చెక్‌మేట్ పెడతా..!." అని బదులిచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట నానా రచ్చ చేస్తోంది. అతనికి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాణించిన వారిని పక్కనపెడుతూ.. రాణించని వారికి అవకాశాలు ఇస్తున్నారంటూ సెలెక్టర్లపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. 

నా చేతుల్లో లేదు: అక్సర్ 

కాగా, టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్సర్ పటేల్.. అది తన చేతుల్లో లేని విషయమని తెలిపాడు. "జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో లేదు.. నా మనస్సులో లేదు.. అది నా నిర్ణయమూ కాదు.. సెలెక్టర్ల నిర్ణయం. నా వరకు జట్టుకు ఉత్తమమైనదాన్ని అందించడమే నా పని.." అని ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.