శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ

శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించింది. ఇన్నింగ్స్ మొదటినుంచే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ దాటిగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. యంగ్ స్టర్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ (50, 52బంతుల్లో) చేసుకోగా, రోహిత్ శర్మది (42) మిస్ అయింది. అవిష్క ఫెర్నాండిస్ బౌలింగ్ లో ఫ్లిక్ షాట్ ఆడబోయి కరుణరత్నేకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్, శుభ్ మన్ తర్వాత గేర్ మార్చారు.  ఆరో ఓవర్లో  తొలిబంతికి 6 కొట్టి తర్వాత బంతికి సింగిల్ తీసి గిల్ కి స్ట్రైక్ ఇస్తాడు. తర్వాత బంతుల్ని గిల్ 4, 4, 4, 4  (23) కొట్టి  విరుచుకుపడ్డారు. 10వ ఓవర్లోనూ రోహిత్ చివరి 3 బంతుల్లో 6,6,4 కొట్టాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ (17)  లంక బౌలర్లను ఆడుకుంటున్నాడు. భారత్ ప్రస్తుతం 118/1 లో (19 ఓవర్లలో) ఉంది.