
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆటగాళ్ల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విండీస్ ఆటగాళ్లను అసభ్య పదజాలంతో దూషించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చర్యలు శృతిమించి ఉండటం గమనార్హం.
ALSO READ: వీడియో: ఏం ఆడుతున్నావ్.. ఇషాన్ కిషన్‌పై రోహిత్ సీరియస్
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. వెస్టిండీస్ బ్యాటర్‌ను అవమానకర రీతిలో సంభోదించాడు. వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న ఇషాన్.. విండీస్ బ్యాటర్ ను ఉద్దేశించి 'Maa Ch#d Diya Keeping Ki' అని నోరు జారాడు. ఆ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Ishan Kishan ?
— Stroke0Genius?? (@Stroke0Genius18) July 14, 2023
Maa Ch#d Diya Keeping Ki ???#INDvsWI #Kishan #TestCricket #Funny pic.twitter.com/k9z2uEU9qM
కిషన్ చర్యలపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్‌కే కొమ్ములు మొలిచాయా.. అంటూ అతన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో కిషన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 20 బంతుల్లో ఎదుర్కొన్న అతను కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు.