
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, ఊరూరా, వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు జెండా ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తున్నాం
రాజన్నసిరిసిల్ల,వెలుగు: జిల్లా సర్వతోముఖాబివృద్దికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవందనం స్వీకరించారు. నేతన్నలకు ఏడాదంతా చేతినిండా పని కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ లు ఇచ్చామన్నారు. రూ.50 కోట్లలో వేములవాడలో యారన్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు.
పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల కు అందిస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా లైబ్రరీ చైర్మన్ అన్నయ్య గౌడ్,
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఏరియాలోని ఆఫీస్‌లో ఆర్జీ 1 జీఎం డి.లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత, ఆర్జీ 2 జీఎం బి.వెంకటయ్య, జాతీయ పతాకాలను ఎగురవేసి గౌరవందనం చేశారు. ఉత్తమ కార్మికులను శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు.
రేషన్ కార్డులు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: రేషన్ కార్డులు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్య్ర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రూ. 13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తోందన్నారు. వేడుకల సందర్భంగా స్టాల్స్ లో తిరుగుతూ వివిధ శాఖల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు స్టాల్స్ ఏర్పాటు చేసిన వారిని అభినందించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన : ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోందని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి'సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని, రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన రేషన్ కార్డును అర్హులై పేదలందరికీ ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేశామని, ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని 70.11 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ఇస్తున్నామని, 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌అందిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి సత్కరించారు.
వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జీ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.