హెచ్​సీయూ ఎన్నికల్లో అవకతవకలు

హెచ్​సీయూ ఎన్నికల్లో అవకతవకలు
  • స్వతంత్ర అభ్యర్థి ఆకాశ్ భాటి ఆరోపణ
  • రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి

పంజాగుట్ట, వెలుగు : హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ) స్టూడెంట్ యూనియన్​ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు స్వతంత్ర అభ్యర్థి ఆకాశ్​భాటి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆదివారం ఆయన మాట్లాడారు. గత నెల 25న ఎన్నికలు జరగగా, మొత్తం 5,165 ఓట్లకు 4,065 ఓట్లు పోల్‌‌‌‌ అయినట్లు చెప్పారు. ఆ మరుసటి రోజు చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్​యూ, ఎస్ఎఫ్ఐ యూనియన్ల మద్దతుతో ఉమేశ్ ​అంబేద్కర్​కు​1,313, తనకు 1,295 ఓట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే,18 ఓట్లు చెల్లనివి ఉన్నాయని, తాము అభ్యంతరం  చెప్తే ఈ నెల 2న రీకౌంటింగ్ నిర్వహించారన్నారు. అందులోనూ చెల్లని ఓట్లను కలిపి లెక్కింపు జరిపారని ఆరోపించారు. ఈ విషయమై తాము హైకోర్టుకు వెళ్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీకి చెందిన వారితో కాకుండా ఇతరులతో పారదర్శకంగా రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థులు అభినవ్, సిద్ధాంత్​శుక్లా ఉన్నారు.