టీమిండియా సరికొత్త రికార్డు

 టీమిండియా సరికొత్త రికార్డు

అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా 168 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. టీ20 చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. అంతకుముందు 2018లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 143 పరుగుల తేడాతో గెలిచింది.

214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 70 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా శుభ్ మన్ గిల్(126)  రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2022లో ఆసియా కప్లో విరాట్ ఆఫ్ఘనిస్తాన్ పై 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.