T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ హిస్టరీ.. టీమిండియా హీరోలు వీరే

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ హిస్టరీ.. టీమిండియా హీరోలు వీరే

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ముగిసి సంవత్సరం కాకముందే మరో ఐసీసీ టోర్నీ టోర్నీ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2 నుంచి వెస్టింసీడ్, అమెరికా వేదికగా 2024 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 29 న ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ లేని టీమిండియా ఈ టీ20 వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉంది.

2007 లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ను ధోనీ నాయకత్వంలో టీమిండియా  పాకిస్థాన్ పై ఫైనల్లో గెలిచి టైటిల్ గెలిచింది. 2007 తర్వాత టీ20 వరల్డ్ కప్ భారత్ కు అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు తరపున బాగా ఆడిన ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం.      
 
విరాట్, అశ్విన్ టాప్:  
 
టీ 20 వరల్డ్ కప్ లో భారత్ తరపున విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. విరాట్ 27 మ్యాచ్ ల్లో 1141 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత వరుసగా రోహిత్ శర్మ (963), యువరాజ్ సింగ్(593), మహేంద్ర సింగ్ ధోనీ(529), గౌతమ్ గంభీర్(524) వరుసగా 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే.. రవి చంద్రన్ అశ్విన్ 24 మ్యాచ్ ల్లో 32 వికెట్లు పడగొట్టి టాప్ లో ఉన్నాడు. రవీంద్ర జడేజా(21), హర్భజన్ సింగ్(16), ఇర్ఫాన్ పఠాన్(16), ఆశీష్ నెహ్రా(15) వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు.

వ్యక్తిగత అత్యధిక స్కోర్ వీరులు:

టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా 101 పరుగులతో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 2010 వరల్డ్ కప్ లో రైనా ఈ ఫీట్ సాధించాడు. బౌలింగ్ లో అశ్విన్ 21 బంతుల్లో 11 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం అత్యుత్తమం. జట్టు అత్యధిక స్కోర్ విషయానికి వస్తే 2007 లో ఇంగ్లాండ్ పై 218 పరుగులు చేసింది.          

భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే ఐర్లాండ్ తో జూన్ 5 న తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.