రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికా–ఎపై ఇండియా–ఎ విక్టరీ

రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికా–ఎపై ఇండియా–ఎ విక్టరీ

రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో విజృంభించడంతో సౌతాఫ్రికా–ఎ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా  గురువారం జరిగిన ఈ పోరులో తొలుత సఫారీ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 285/9 స్కోరు చేసింది. టాపార్డర్ ఫెయిలవడంతో ఓ దశలో 16/4తో నిలిచిన సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెలనో పోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గీటర్ (90), డియాన్ ఫారెస్టర్ (77), బోర్న్ ఫోర్చున్ (59) ఆదుకున్నారు.

 ఇండియా బౌలర్లలో అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడు  కెప్టెన్ తిలక్ వర్మ (39), నితీశ్ రెడ్డి (37) రాణించడంతో ఇండియా–ఎ 49.3 ఓవర్లలో 290/6 స్కోరు చేసి గెలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.