
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఇండియా వుమెన్స్–ఎ టీమ్ పర్యటన ఖరారైంది. మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం డిసెంబర్‌లో టీమిండియా అక్కడ పర్యటించనుంది. బ్రిస్బేన్, గోల్డ్‌కోస్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగునున్నాయి. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 12, 14, 16న ఇండియా–ఎ, ఆసీస్–ఎ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. 19, 21, 23న గోల్డ్‌కోస్ట్‌లో మూడు టీ20లు ఆడుతారు. బీసీసీఐ, సీఏ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రతి ఏడాది ఇరు దేశాల మధ్య సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో తొలి సిరీస్ జరిగింది. ‘మా మహిళా క్రికెటర్ల కోసం తొలిసారి ‘ఏ’ జట్ల మధ్య సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్నాం. నైపుణ్యం ఉన్న క్రికెటర్లను గుర్తించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. మహిళా క్రికెట్‌లో ఇదో కొత్త ఆధ్యాయం. ఈ పద్ధతి ద్వారా చాలా మంది ఉత్తమ క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. దీనికి సంబంధించి చాలా కసరత్తులు చేశాం. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఈ మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది. అండర్-–19 జట్ల మధ్య కూడా మాకు వార్షిక సిరీస్‌లు ఉన్నాయి’ అని ఆసీస్ ఫిమెల్ హై ఫెర్ఫామెన్స్ మేనేజర్ షాన్ ఫ్లెగ్లెర్ పేర్కొన్నారు.