మోదీ నాయకత్వానికి ప్రపంచ బ్యాంకు ప్రశంస: అమిత్ షా

మోదీ నాయకత్వానికి ప్రపంచ బ్యాంకు ప్రశంస: అమిత్ షా

న్యూఢిల్లీ:  ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆరేండ్లలోనే 80 శాతం ఫైనాన్షియల్ ఇన్ క్లూషన్ లక్ష్యాన్ని సాధించిందని ప్రపంచబ్యాంకు సైతం ప్రశంసించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జీ20 సమిట్ సందర్భంగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రిపోర్ట్ ను ప్రస్తావిస్తూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మామూలుగా అయితే 47 ఏండ్లలో ఇది సాధ్యమయ్యేది. 

కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో ఇది ఆరేండ్లలోనే జరిగింది. జన్ ధన్, ఆధార్, యూపీఐ వంటి వాటితో కోట్లాది మంది సాధికారతకు వీలైంది. కేంద్రం తెచ్చిన డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానంతో 33 బిలియన్ డాలర్ల నిధులు (రూ. 2.74 లక్షల కోట్లు) ఆదా అయ్యాయని కూడా రిపోర్ట్ ప్రశంసించింది” అని అమిత్ షా పేర్కొన్నారు.