
ఆపరేషన్ సింధూర్ ప్రారంభంలో భారత్స్వల్ప నష్టాలను చవిచూసిందని CDS జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. అయితే ఆరు యుద్ద విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనను ఆయన తీవ్రంగా తిరస్కరించారు. ఇది పూర్తిగా తప్పు అని బ్లూమ్‌బెర్గ్ కు ఇచ్చిన ఇంటర్యూలో CDS జనరల్ అనిల్ చౌహాన్అన్నారు.
ఆపరేషన్ సింధూర్‌పై మాట్లాడిన జనరల్ చౌహాన్.. వ్యూహాత్మక లోపాల కారణంగా భారత్ వైమానిక స్థావరాల్లో ప్రారంభ నష్టాలను చవిచూసిందన్నారు. అయితే త్వరగా వాటిని సరిదిద్దుకుదని 48 గంటల్లో మెరుపుదాడి చేశామన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆరు భారత యుద్ద విమానాలు కూలిపోయాయని పాకిస్తాన్ చేసిన వాదనలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘అది పూర్తిగా తప్పు..అవి ఎందుకు కూలిపోయాయి..ఏ తప్పులు జరిగాయి అనేది ముఖ్యమైనవి.. సంఖ్యలు ముఖ్యం కాదు’’ అని అన్నారు. నష్టం తర్వాత కేవలం రెండు రోజుల్లోనే పాకిస్తాన్ లక్ష్యాలపై మా జెట్ విమానాలన్ని లాంగ్ రేంజ్ దాడులుచేశాయన్నారు.
గతంలో భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఎకె భారతి మాట్లాడుతూ నష్టాలు యుద్ధంలో ఒక భాగం అని అంగీకరించారు .అన్ని ఐఎఎఫ్ పైలట్లు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత విమాన నష్టాల గురించి అడిగినప్పుడు మే 11న జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.