ఆఖరాట వానది.. సిరీస్​ ఇద్దరిది

ఆఖరాట వానది..  సిరీస్​ ఇద్దరిది
  • ఆఖరాట వానది సిరీస్​ ఇద్దరిది
  • ఇండియా‑సౌతాఫ్రికా ఐదో టీ20 రద్దు
  • ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్​గా భువనేశ్వర్​  

బెంగళూరు: నువ్వానేనా అన్నట్టు సాగిన ఇండియా–సౌతాఫ్రికా టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనూహ్య ముగింపు. ఆఖరాటలో గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకోవాలనుకున్న ఇరు జట్లతో పాటు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు వాన దేవుడు షాకిచ్చాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరగాల్సిన చివరి, ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ వర్షం కారణంగా రద్దయింది. కేవలం 3.3  ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.   చెరో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు గెలిచి 2–2తో ఉన్న ఇండియా, సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ను పంచుకున్నాయి. తొలుత టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత వాన పడటంతో 50 నిమిషాలు ఆలస్యంగా ఆట మొదలైంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను19 ఓవర్లకు కుదించారు. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు రాగా  స్టాండిన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ మహారాజ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తొలి, మూడో బాల్స్‌‌‌‌‌‌‌‌ను ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ (15) సిక్సర్లుగా మలిచాడు. కానీ, రెండో ఓవర్లో స్లో బాల్‌‌‌‌‌‌‌‌తో అతడిని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఎంగిడి తన తర్వాతి ఓవర్లోనే రుతురాజ్‌‌‌‌‌‌‌‌ (10)ను కూడా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. కానీ, మరో బాల్‌‌‌‌‌‌‌‌ పడిన వెంటనే వర్షం రావడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నిలిపేశారు. వాన తగ్గకపోవడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కూడా సాధ్యం కాలేదు. దాంతో, 9.30 సమయంలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. నాలుగు  మ్యాచ్​ల్లో 6 వికెట్లు తీసిన  భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్​గా నిలిచాడు.