
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం బంగ్లాదేశ్ భారతదేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 3 కోట్ల వ్యాక్సిన్ డోసులను బంగ్లాదేశ్‌కు పంపించనుంది. ఇండియా, బంగ్లాదేశ్ తో పాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సింకో ఫార్మాసూటికల్స్ కూడా ఈ డీల్‌లో ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్‌కు సరఫరా చేయనుంది. ఈ డీల్ తో బంగ్లాదేశ్‌తో.. భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయంటూ బంగ్లాదేశ్‌లో ఇండియా హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ట్వీట్ చేశారు.