Cricket World Cup 2023: ఆస్ట్రేలియా 24 ఏళ్ళ జైత్రయాత్రకు టీమిండియా బ్రేక్..

Cricket World Cup 2023: ఆస్ట్రేలియా 24 ఏళ్ళ జైత్రయాత్రకు టీమిండియా బ్రేక్..

అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ తో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ అనే సరికి ఫ్యాన్స్ తో పాటు టీమిండియాకు కూడా కాస్త కంగారు పడింది. పటిష్టమైన ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చూపించాలంటే శక్తికి మించి పోరాడాల్సిందే అనుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ లు ఎలా ఆడినా ప్రపంచ కప్ లో వారికి తిరుగుండదనుకున్నారు. కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ టీమిండియా ఆసీస్ జట్టుని చిత్తు చేసింది. సొంతగడ్డపై కంగారూల జట్టుపై చెమటలు పట్టించి వరల్డ్ కప్ లో బోణీ కొట్టింది.

ఈ  విజయంతో భారత్ తమ ఖాతాలో రెండు పాయింట్లు వేసుకోగా..ఆసీస్ మాత్రం గెలవాల్సిన మ్యాచులో ఓడిపోయింది. ఇక ఈ పరాజయంతో కంగారూల జట్టు 1996 తర్వాత వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచులో ఓడిపోవడం గమనార్హం. 1999 నుంచి ఆస్ట్రేలియా ప్రతి వన్డే వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ గెలుస్తూనే వచ్చింది. కానీ నిన్న జరిగిన వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచులో ఆసీస్ కి విజయం దక్కకుండా భారత్ వారి 24 ఏళ్ళ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. వరల్డ్ కప్ లో అద్భుతమైన రికార్డ్ ఉన్న ఆసీస్ ని  తొలిమ్యాచులోనే చిత్తు చేసి బోలెడంత ఆత్మ విశ్వాసాన్ని కూడ  కట్టుకుంది. 

ALSO READ :Cricket World Cup 2023:  విరాట్ కోహ్లీకి బెస్ట్ ఫీల్డర్ అవార్డు: సెలెబ్రేషన్ చూస్తే నవ్వాగదు

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై చెపాక్ లో జరిగిన ఈ  మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో వికెట్ కోల్పోయినా ఆ తర్వాత స్మిత్, వార్నర్ బ్యాటింగ్ తో కుదురుకున్నట్టే కనిపించింది. కానీ టీమిండియా స్పిన్నర్లు ఒక్కసారిగా విజ్రంభించడంతో ఆసీస్ 199 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 2 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా.. కోహ్లీ (85) రాహుల్ (97) భారీ భాగస్వామ్యంతో భారత్ వరల్డ్ కప్ తొలి మ్యాచులో సూపర్ విక్టరీ నమోదు చేసింది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)