Cricket World Cup 2023: విరాట్ కోహ్లీకి బెస్ట్ ఫీల్డర్ అవార్డు: సెలెబ్రేషన్ చూస్తే నవ్వాగదు

Cricket World Cup 2023: విరాట్ కోహ్లీకి బెస్ట్ ఫీల్డర్ అవార్డు: సెలెబ్రేషన్ చూస్తే నవ్వాగదు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లోనే కాదు ఫిల్డింగ్ లో కూడా సత్తా చాటగలడు. వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్లలో ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎన్నో గ్రేట్ క్యాచులను అందుకొని తానొక బెస్ట్ ఫీల్డర్ అని ప్రపంచానికి చాటి చెప్పాడు. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఒక స్టన్నింగ్ క్యాచుతో మెరిశాడు. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు. 

ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచిన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కోహ్లీకి బెస్ట్ ఫీల్డర్ గా మెడల్ గెలుచుకున్నాడు. భారత మాజీ కెప్టెన్‌కు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఉత్తమ ఫీల్డర్ అవార్డును అందించారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మార్ష్‌ ఇచ్చిన క్యాచుని కోహ్లీ  ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా మెడల్ వేస్తున్నప్పుడు, వేసిన తర్వాత  కోహ్లీ చేసిన విన్యాసాలు నవ్వు తెప్పించాయి. 

ALSO READ : Cricket World Cup 2023: ఆస్ట్రేలియా 24 ఏళ్ళ జైత్రయాత్రకు టీమిండియా బ్రేక్..

విరాట్ కోహ్లి తన ముఖంపై చిరునవ్వుతో  మెడలో పతకాన్ని వేయమని దిలీప్‌ను కోరాడు. ఆ తర్వాత మెడల్ ని ముద్దు పెట్టుకుంటూ చిన్న పిల్లాడిలా కోహ్లీ చేసిన చేష్టలు హైలెట్ గా మారాయి. కాగా.. ఈ మ్యాచులో కోహ్లీ బ్యాటింగ్ లోను సత్తా చాటి 85 పరుగులతో టీమిండియా విజయంలో  కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు మీద గెలిచి మన జట్టు వరల్డ్ కప్ లో బోణీ కొట్టడంతో అభిమానులతో పాటు  డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సరదాగా సెలెబ్రేషన్స్ చేసుకోవడం వైరల్ గా మారింది.