సూడాన్‌‌ నుంచి మరో 229 మంది రాక

సూడాన్‌‌ నుంచి మరో 229 మంది రాక

న్యూఢిల్లీ: అధికారం కోసం సూడాన్‌‌లో జరుగుతున్న ఘర్షణలు మూడో వారానికి చేరుకున్నాయి. శనివారం కూడా దేశ రాజధాని ఖర్టూమ్‌‌లో కాల్పుల మోత మోగింది. రోజురోజుకూ అక్కడ పరిస్థితి దిగజారుతుండటంతో ఆ దేశ ప్రజలు వేరే ప్రాంతానికి పారిపోతున్నారు. ఇందులో విదేశీయులు కూడా వారి సొంత దేశాలకు సౌదీ అరేబియా సాయంతో వెళ్తున్నారు. సూడాన్‌‌లోని ఇండియా, యూఏఈ, బ్రిటన్‌‌, అమెరికా ప్రజలను ఆయా దేశాలు ప్రత్యేక మిషన్‌‌ చేపట్టి తరలిస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం 10వ బ్యాచ్‌‌ కింద 135 మంది ఇండియన్‌‌ సిటిజన్లను సూడాన్‌‌ నుంచి సక్సెస్‌‌ఫుల్‌‌గా మనదేశం తరలించింది. కాగా, ఇండియా చేపట్టిన ‘ఆపరేషన్‌‌ కావేరీ’కింద 229 మంది ప్రయాణికులతో బయలుదేరిన 7వ విమానం సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ నుంచి ఆదివారం బెంగళూరులో ల్యాండ్‌‌ అయింది.

ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌‌ బాగ్చి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 1,191 మంది ఇండియన్లు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 117 మంది ఎల్లో ఫీవర్‌‌‌‌కు వ్యాక్సిన్‌‌ వేయకపోవడంతో ప్రస్తుతం వారు క్వారంటైన్‌‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.