హైపర్ సోనిక్​లో ఇండియా, చైనాలే టాప్

హైపర్ సోనిక్​లో ఇండియా, చైనాలే టాప్
  • అమెరికా డామినేషన్ తగ్గింది: యూఎస్ సెనేటర్ జాక్ రీడ్ 

వాషింగ్టన్:  అనేక ఆధునిక టెక్నాలజీల్లో అమెరికా ఆధిపత్యం తగ్గిపోతోందని యూఎస్ సెనేటర్, సెనేట్ సాయుధ బలగాల కమిటీ చైర్మన్ జాక్ రీడ్ అన్నారు. ప్రధానంగా హైపర్ సోనిక్ టెక్నాలజీలో ఇప్పుడు ఇండియా, చైనా, రష్యాలే ముందంజలో ఉన్నాయని చెప్పారు. బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసినం. అందరికంటే మోడ్రన్ టెక్నాలజీలు వాడినం. కానీ మన డామినేషన్ ఇంకెంతో కాలం సాగదు. హైపర్ సోనిక్ టెక్నాలజీలో ఇండియా, చైనా, రష్యా చాలా క్లియర్ గా ముందంజలో ఉన్నాయి” అని అభిప్రాయపడ్డారు.