ఈ వారం ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా క్యూ1 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌

ఈ వారం ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా క్యూ1 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌


ముంబై: ఈ వారం  స్టాక్ మార్కెట్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ను  ఇండియాతో సహా  అమెరికా ఇన్‌‌‌‌ఫ్లేషన్  నెంబర్లు నిర్ణయించనున్నాయి.  దీంతో పాటు  పెద్ద కంపెనీల జూన్ క్వార్టర్ (క్యూ1) ఫలితాలు, భారత్–-అమెరికా వాణిజ్య చర్చల ఫలితాలు, గ్లోబల్ టారిఫ్‌‌‌‌ల ప్రభావం కూడా ఉంటుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. 

కిందటి వారం సెన్సెక్స్ 932.42 పాయింట్లు (1.11శాతం), నిఫ్టీ 311.15 పాయింట్లు (1.22శాతం) క్షీణించాయి. హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, విప్రో, జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్ వంటి కంపెనీలు ఈ వారం తమ క్యూ1 ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నెల 14న  ఇండియా హోల్‌‌‌‌సేల్‌‌‌‌, రిటైల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్ డేటా, 15 న అమెరికా రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ డేటా వెలువడనున్నాయి. ఫారిన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల (ఎఫ్‌‌‌‌ఐఐల) కదలికలు,  క్రూడ్ ఆయిల్ ధరలు,  చైనా జీడీపీ డేటాపై ఫోకస్ పెట్టాలని ట్రేడర్లకు ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.