శిల్పారామంలో ఇండియా క్రాఫ్ట్ మేళా షురూ

శిల్పారామంలో ఇండియా క్రాఫ్ట్ మేళా షురూ

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​శిల్పారామంలో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్ట్స్ టైల్స్, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన  ఆల్​ఇండియా క్రాఫ్ట్​ మేళా సందర్శకులతో సందడిగా మారింది. ఆదివారం మేళాను రాష్ర్ట చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు.  చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్​ను సందర్శించారు. 

అనంతరం కళాకారుల నృత్య ప్రదర్శనను తిలకించారు. హైదరాబాద్ అసోం అసోసియేషన్ నిర్వహించిన సంగీతం, బిహు నృత్యాలు అలరించాయి. ఆంధ్రనాట్యం కళాకారులు సంజయ్ వాడపల్లి టీమ్ పుష్పాంజలి, శివ కైవారం, ఆధ్యాత్మ రామాయణ కీర్తన, నవజనార్ధన పారిజాతం వంటి అంశాలను ప్రదర్శించి మెప్పించారు. వరంగల్ కళాకారులు శంకరాధిత్య, వేదశ్రీ కర్ణాటక గాత్ర కచేరి  ఆకట్టుకుంది. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, వీవర్ సర్వీస్ సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.