వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్

వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్

దేశంలో వ్యాక్సినేషన్ అరుదైన మైలురాయిని చేరుకుంది. వంద కోట్ల డోసును పంపిణీ చేసినట్లు ప్రకటించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. రికార్డు టైంలో ఈ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంగ్రాట్యూలేషన్స్ అంటూ ట్వీట్ చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకూ 18 ఏళ్లకు పైబడిన వారిలో 75 శాతం ఒక డోసు, 31 శాతం జనాభా రెండు డోసులు వేసుకున్నారని చెప్పారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియ. జనవరి 16న ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వంద కోట్ల డోసులు పంపిణీ సందర్భంగా ఢిల్లీలోని RML హాస్పిటల్ ను సందర్శించారు ప్రధాని మోడీ. పొరుగు దేశం చైనా వంద కోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ గత జూన్ లోనే పూర్తి చేసింది. దాని తర్వాతి స్థానంలో భారత్ నిలవనుంది.