ఫస్ట్​ వన్డేలో హిట్​

ఫస్ట్​ వన్డేలో హిట్​

అహ్మదాబాద్‌‌: హిస్టారికల్‌‌ థౌజెండ్‌‌ వన్డే మ్యాచ్‌‌లో టీమిండియాదే గ్రాండ్‌‌ విక్టరీ. ఛేజింగ్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ (51 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 60) సూపర్‌‌ షోకు తోడుగా స్పిన్నర్లు యజ్వేంద్ర చహల్‌‌ (4/49), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (3/30) మ్యాజిక్‌‌ చేయడంతో.. ఆదివారం వెస్టిండీస్‌‌తో జరిగిన ఫస్ట్‌‌ వన్డేలో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ఇండియా 1–0 లీడ్‌‌లో నిలిచింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ చేసిన వెస్టిండీస్‌‌ 43.5 ఓవర్లలో 176 రన్స్‌‌కు ఆలౌటైంది. జాసన్‌‌ హోల్డర్‌‌ (71 బాల్స్‌‌లో 4 సిక్సర్లతో 57) హాఫ్‌‌ సెంచరీతో చెలరేగాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 28 ఓవర్లలో 4 వికెట్లకు 178 రన్స్‌‌ చేసి నెగ్గింది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (36 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 34 నాటౌట్‌‌) ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చాడు.  చహల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. లెజెండరీ సింగర్‌‌ లతా మంగేష్కర్‌‌ మృతికి సంతాపంగా టీమిండియా క్రికెటర్లు బ్లాక్‌‌ ఆర్మ్‌‌ బ్యాండ్‌‌ ధరించి మ్యాచ్‌‌ ఆడారు. 

‘హిట్‌‌’మ్యాన్‌‌..
టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రోహిత్‌‌ బౌండ్రీలతో మోత మోగిస్తే.. ఇషాన్‌‌ కిషన్‌‌ (28) నెమ్మదిగా ఆడాడు. 10వ ఓవర్‌‌ (రోచ్‌‌)లో రోహిత్‌‌.. రెండు ఫోర్లు,  ఓ సిక్స్‌‌తో 15 రన్స్‌‌ రాబట్టడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఇండియా 67/0 స్కోరు చేసింది. 42 బాల్స్‌‌లో ఫిఫ్టీ చేసిన హిట్‌‌మ్యాన్‌‌ను 14 ఓవర్‌‌లో జోసెఫ్‌‌ ఎల్బీ చేశాడు. దీంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 84 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇదే ఓవర్‌‌లో కోహ్లీ (8) వరుసగా రెండు ఫోర్లు కొట్టినా ఐదో బాల్‌‌కు ఔటయ్యాడు. రిషబ్‌‌ (11) ఓ సిక్స్‌‌, ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. కానీ ఆరు బాల్స్‌‌ తేడాతో పంత్‌‌, ఇషాన్‌‌ వెనుదిరగడంతో ఇండియా 116/4తో కాస్త ఢీలా పడింది. ఈ దశలో సూర్యకుమార్‌‌, దీపక్‌‌ హుడా (26 నాటౌట్‌‌) మంచి ఆటతో ఆకట్టుకున్నారు. విండీస్‌‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌‌కు 62 రన్స్‌‌ జోడించడంతో ఇండియా విజయం లాంఛనమైంది. 

చహల్‌‌, సుందర్‌‌ మ్యాజిక్‌‌
అంతకుముందు స్లో ట్రాక్‌‌పై ఇండియన్‌‌ స్పిన్నర్లు చహల్‌‌, సుందర్‌‌.. విండీస్‌‌ ఇన్నింగ్స్‌‌ను పేకమేడలా కూల్చిన్రు. థర్డ్‌‌ ఓవర్‌‌లోనే ఓపెనర్‌‌ హోప్‌‌ (8)ను..  సిరాజ్‌‌ (1/26) ఔట్‌‌ చేశాడు. ఈ దశలో డారెన్‌‌ బ్రావో (18),  బ్రెండన్‌‌ కింగ్‌‌ (13) సెకండ్‌‌ వికెట్‌‌కు 31 రన్స్‌‌ యాడ్‌‌ చేసిన్రు. ఫస్ట్‌‌ టెన్‌‌లో విండీస్‌‌ 39/1 స్కోరు చేసింది. అయితే 12వ ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన సుందర్‌‌.. ఐదు బాల్స్‌‌ తేడాలో కింగ్‌‌, బ్రావోను ఔట్‌‌ చేయడంతో విండీస్‌‌ స్కోరు 45/3గా మారింది. 20వ ఓవర్‌‌లో చహల్‌‌ వరుస బాల్స్‌‌లో నికోలస్‌‌ పూరన్‌‌ (18), పొలార్డ్‌‌ (0) ఔట్‌‌ చేశాడు. పూరన్‌‌ వికెట్‌‌.. చహల్‌‌కు వందోది కావడం విశేషం. 71 రన్స్‌‌కే 5 కీలక వికెట్లు పడటంతో ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే బాధ్యత హోల్డర్‌‌పై పడింది. అయితే రెండో ఎండ్‌‌లో చహల్‌‌, ప్రసీద్‌‌.. వరుస ఓవర్లలో బ్రూక్స్‌‌ (12), అకీల్‌‌ హోస్సేన్ (0)ను పెవిలియన్‌‌కు పంపడంతో విండీస్‌‌ 79/7తో ఇబ్బందుల్లో పడింది. ఈ టైమ్‌‌లో హోల్డర్‌‌ 4 భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఫ్యాబియన్‌‌ అలెన్‌‌ (29) అండగా నిలవడంతో ఎనిమిదో వికెట్‌‌కు 78 రన్స్‌‌ జతయ్యాయి. ఇక ఫర్వాలేదనుకున్న టైమ్‌‌లో సుందర్‌‌ మంచి రిటర్న్‌‌ క్యాచ్‌‌తో అలెన్‌‌ను ఔట్‌‌ చేశాడు. కొద్దిసేపటికే హోల్డర్‌‌, అల్జారీ జోసెఫ్‌‌ (13) కూడా వెనుదిరగడంతో విండీస్‌‌ పూర్తి ఓవర్లు ఆడలేదు.

షార్ట్‌‌ స్కోర్స్‌‌
వెస్టిండీస్​: 176 ఆలౌట్‌‌ (హోల్డర్‌‌ 57, అలెన్‌‌ 29, చహల్‌‌ 4/49, సుందర్‌‌ 3/30), ఇండియా: 178/4 (రోహిత్‌‌ 60, సూర్యకుమార్‌‌ 34*, జోసెఫ్‌‌ 2/45).