IND vs ENG 5th Test: 500కు చేరువగా టీమిండియా.. ధర్మశాల టెస్టులో వార్ వన్ సైడ్

IND vs ENG 5th Test: 500కు చేరువగా టీమిండియా.. ధర్మశాల టెస్టులో వార్ వన్ సైడ్

ధర్మశాల టెస్టులో భారత్ టెస్ట్ మ్యాచ్ ను పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంది. తొలి రోజు బౌలింగ్, రెండో రోజు బ్యాటింగ్ లో సత్తా చాటడంతో ఈ మ్యాచ్ పై పట్టు బిగిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. క్రీజ్ లో కుల్దీప్ యాదవ్(27), జస్ప్రీత్ బుమ్రా(19) ఉన్నారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం 255 పరుగులు ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు ఉండడంతో మరో 30 నుంచి 40 పరుగులు జోడించే అవకాశం ఉంది. 

3 వికెట్లకు 376 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే సర్ఫరాజ్ ఖాన్ రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన ఖాన్ బషీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత పడికల్, జడేజా చిన్న భాగస్వామ్యం నెలకొల్పినా.. ఆ తర్వాత 25 పరుగుల తేడాతో అనూహ్యంగా 4 వికెట్లను కోల్పోయింది. 450 పరుగులైనా చేస్తుందా లేదనుకున్న సమయంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. 9 వికెట్ కు అజేయంగా 45 పరుగులు జోడించి రెండో రోజును ముగించారు.

ALSO READ :- IND vs ENG 5th Test: కోహ్లీని గుర్తు చేశావుగా: గిల్ సిక్సర్‌కు బిత్తరపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్

తొలి రెండు సెషన్ లలో వికెట్స్ తీయడానికి కష్టపడిన ఇంగ్లాండ్ బౌలర్లు.. మూడో సెషన్ లో మాత్రం 5 వికెట్లు తీసుకున్నారు. బషీర్ నాలుగు వికెట్లు తీసుకోగా.. హర్టీలి 2 వికెట్లు తీసుకున్నాడు. స్టోక్స్, అండర్సన్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు రోహిత్ శర్మ (103), శుభమాన్ గిల్ (110) సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌటైంది.